వీడియో : అందాల ఆరబోతలో వాళ్లకు పోటీ ఇస్తున్న బుల్లితెర బ్యూటీ

Wed May 25 2022 15:00:01 GMT+0530 (IST)

vishnupriya latest video

బుల్లి తెరపై శ్రీముఖి స్నేహితురాలిగా మంచి ఫాలోయింగ్ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ విష్ణు ప్రియ. ఈ అమ్మడు సౌత్ స్టార్ హీరోయిన్స్ కంటే ఒకింత ఎక్కువగానే అందంగా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మంచి ఫిజిక్ మరియు హైట్ ను కలిగి ఉన్న విష్ణు ప్రియ ఏ కాస్ట్యూమ్స్ లో అయినా.. ప్రతి ఒక్క ఔట్ ఫిట్ లో కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది.ముఖ్యంగా స్కిన్ షో మరియు క్లీ వేజ్ షో చేస్తే బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ఈమె ముందు దిగదుడుపే అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు.

బుల్లి తెరపై సందడి చేసిన ఈ అమ్మడు వెండి తెరపై కూడా మెరుస్తూ ఉంది. హీరోయిన్ గా సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతు ఉన్న ఈ అమ్మడికి చిన్నా చితకా ఆఫర్లు వస్తున్నాయి కాని కాస్త పెద్ద ఆఫర్ల కోసం వెయిట్ చేస్తుందట.

హీరోయిన్స్ లకు ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోత చేస్తూ ప్రతి ఒక్కరిని అబ్బురపరిచే ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ మాస్ స్టెప్పులు వేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపే విధంగా విష్ణు ప్రియ వీడియో ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. బుల్లి తెర బ్యూటీ అయినా కూడా ఈ అమ్మడి అందాలు వెండి తెరకు సెట్ అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

హీరోయిన్స్ కు పోటీ ఇచ్చే విధంగా విష్ణు ప్రియ ఇన్ స్టా రీల్స్ మరియు పోస్ట్ లు ఉంటున్నాయి. మిలియన్ ఫాలోవర్స్ కు చేరువగా ఉన్న ఈ అమ్మడు తన ఫాలోవర్స్ అందరికి కూడా కన్నుల విందు చేయడం కోసం ఈ ఫోటో షూట్స్ తో రెచ్చి పోతూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన వీడియో అందులో భాగమే. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో నటించేందుకు కూడా సై అంటున్న విష్ణు ప్రియ కు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె ఫాలోవర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.