Begin typing your search above and press return to search.

ఎలాంటి హడావుడి లేకుండా వస్తోన్న యాక్షన్ హీరో సినిమా..!

By:  Tupaki Desk   |   19 Jan 2022 7:10 AM GMT
ఎలాంటి హడావుడి లేకుండా వస్తోన్న యాక్షన్ హీరో సినిమా..!
X
యాక్షన్ హీరో విశాల్ తమిళ, తెలుగు భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ మరియు మార్కెట్ ఏర్పరచున్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్న విశాల్.. ఇప్పుడు ఐదు సినిమాలను లైన్ లో పెట్టారు. వాటిలో ''సామాన్యుడు'' అనే చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేశారు. 'నాట్ ఏ కామన్ మ్యాన్' అనేది దీనికి ఉపశీర్షిక.

తెలుగులో ‘సామాన్యుడు’ పేరుతో రాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని.. తమిళంలో ‘వీరమే వాగై సూదుం’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే సంక్రాంతి సీజన్ లో పాన్ ఇండియా సినిమాలు తప్పుకోవడంతో జనవరి 14న రిలీజ్ చేయాలని అనుకున్నారు.

అదే సమయంలో కరోనా నేపథ్యంలో తమిళనాడులో థియేటర్లు క్లోజ్ చేయడంతో 'సామాన్యుడు' సినిమాని మరోసారి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించుకోడానికి అవకాశం ఉండటంతో జనవరి 26న వరల్డ్ వైడ్ విశాల్ అప్ కమింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

కాకపోతే ఎలాంటి హడావుడి లేకుండా 'సామాన్యుడు' సినిమా విడుదల అవుతోంది. దీనిని బట్టి అప్పటికి థియేటర్ల పరిస్థితి.. ప్రేక్షకుల మనస్థితిని పరిగణలోకి తీసుకొని సినిమాని రిలీజ్ చేయాలని విశాల్ అనుకుంటున్నారేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి వరకు 2022 జనవరి 26 విడుదల అని పోస్టర్స్ వదిలిన చిత్ర బృందం.. ఇప్పుడు కొత్త పోస్టర్స్ లో 'త్వరలో థియేటర్లలోకి రాబోతోంది' అని పేర్కొన్నారు.

'సామాన్యుడు' సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఈరోజు బుధవారం సాయంత్రం రెండు భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కానీ రిలీజ్ తేదీని ప్రస్తావించలేదు. ట్రైలర్ తో దీనిపై క్లారిటీ ఇస్తారేమో. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్ - టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. మరి థియేట్రికల్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

కాగా, ''సామాన్యుడు" చిత్రానికి తూ.పా. శరవణన్ దర్శకత్వం వహించారు. ఇందులో విశాల్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా.. యోగిబాబు కీలక పాత్ర పోషించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యువన్ శకర్ రాజా సంగీతం సమకూర్చారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఎస్ఎస్ మూర్తి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఎన్బీ శ్రీకాంత్ ఎడిటింగ్ వర్క్ చేశారు.