Begin typing your search above and press return to search.

విశాల్ గుండెలపై ఎంజీఆర్

By:  Tupaki Desk   |   24 Jan 2023 9:10 PM GMT
విశాల్ గుండెలపై ఎంజీఆర్
X
సినీ, రాజకీయ రంగాలకు విడదీయలేని అవినాభావ సంబంధం ఉంటుంది. మన తెలుగులోనే కాదు తమిళంలో కూడా సినిమాల్లో రాణించిన తర్వాత రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా అయిన వారు కూడా ఉన్నారు. తెలుగులో నందమూరి తారక రామారావు ఏపీ ముఖ్యమంత్రిగా చాలాకాలం పనిచేస్తే... తమిళనాడులో ఎంజీఆర్ కూడా అదే విధంగా సినిమా హీరోగా సత్తా చాటి తర్వాత ముఖ్యమంత్రిగా తమిళనాడు రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు పాలించారు.

మరదూర్ గోపాలం రామచంద్రన్ అనే ఆయనను ఎక్కువగా ఎంజీఆర్ అనే పేరుతోనే పిలుస్తూ ఉంటారు. మొదట ద్రవిడ మున్నేట్ర కళగం అంటే డీఎంకే పార్టీలో చేరి తర్వాత సొంతంగా బయటకు వచ్చి అన్నాడీఎంకే పేరుతో ప్రత్యేక పార్టీ స్థాపించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఆయనకు ఎనలేని గౌరవం ఉంది. ఆయన కనుమరుగై దాదాపు 36 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు ఆయన పేరుని ఇమేజ్ ని ఉపయోగించుకుని ఎన్నికల ప్రచారం చేసే విధంగా ఆయనకు ఓటు బ్యాంకు కూడా ఉంది.

ఇప్పటికీ తమిళనాడు గ్రామాల్లో ఎంజీఆర్ ను దేవుడుగా ఆరాధించేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అనేక మంది పేదలు కూడా ఎంజీఆర్ పచ్చబొట్టును తమ గుండెల మీద చేతుల మీద పొడిపించుకుంటూ ఉంటారు. అలాంటి ఎంజీఆర్ పచ్చబొట్టును హీరో విశాల్ తన గుండెల మీద పడించుకోవడం ఆసక్తికరంగా మారింది. హీరో విశాల్ తెలుగువాడైనా సరే తమిళంలో నెలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ వర్కౌట్ కాకపోవడంతో ప్రస్తుతానికి పూర్తిగా సినిమాల మీదనే దృష్టి పెట్టాడు.

ఇక విశాల్ ఏదైనా సినిమా కోసం ఎంజీఆర్ పచ్చబొట్టును గుండెల మీద పొడిపించుకున్నాడా... లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. విశాల్ ప్రస్తుతానికి ఆది రవిచంద్రన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తున్న ఈ సినిమాలో మన తెలుగు నటుడు సునీల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.