అయితే విక్రమార్కుడు లేకపోతే డిస్కోరాజా?

Mon May 03 2021 10:16:20 GMT+0530 (IST)

vikramarkudu disco raja o khiladi

ద్విపాత్రాభినయం క్లిక్కయితే దాని రేంజే వేరుగా ఉంటుంది. మాస్ మహారాజా రవితేజ కెరీర్ బెస్ట్ మూవీగా ఇప్పటికీ విక్రమార్కుడు రికార్డుల్లో ఉంది. రాజా లైన్ అండ్ లెంగ్త్ కి తగ్గట్టు రాజమౌళి ఆ చిత్రాన్ని రూపొందించారు. అత్తిలి సత్తిగా పవర్ ఫుల్ పోలీసాఫీరస్ గా రవితేజ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ని తెరపై అభిమానులు ఎంజాయ్ చేశారు.అందుకే రవితేజ మరోసారి డబుల్ యాక్షన్ కి రెడీ అవుతున్నారు అనగానే అందరిలో ఒకటే ఉత్కంఠ. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఖిలాడీ చిత్రంలో డబుల్ యాక్షన్ తో మాస్ రాజా అదరగొట్టబోతున్నాడట. అయితే ద్విపాత్రాభినయంతో రాజాకి కొన్ని చిక్కులు కూడా లేకపోలేదు.

రవితేజకు అచ్చిరాని డబుల్ యాక్షన్ సినిమాలు!! అంటూ ఒక సెక్షన్ విశ్లేషణ సాగిస్తోంది. అయితే విక్రమార్కుడి మాదిరిగా పెద్ద హిట్ అవుతాయి.. లేకపోతే డిస్కో రాజా మాదిరిగా డిజాస్టర్ అయిపోతాయి! అంటూ డౌట్లు పెట్టేస్తున్నారు. కానీ రవితేజ తనదైన ఎనర్జీతో మరో విక్రమార్కుడి రేంజు హిట్టు కొడతాడనే ఆశిద్దాం. ఖిలాడీ లో అతడి ద్విపాత్రాభినయం మరో రేంజులో ఎలివేట్ చేస్తున్నారట రమేష్ వర్మ. రాక్షసుడు లాంటి బ్లాక్ బస్టర్ సాధించాక అతడు రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ కూడా అంతే ఉత్సాహంగా బ్యాక్ టు బ్యాక్ హిట్టు కొట్టి తన మార్కెట్ ని వెనక్కి తేవాలనే కసితో నటిస్తున్నారు.