సౌత్ సినిమాల ముందు తేలిపోయిన బాలీవుడ్ మల్టీస్టారర్

Thu Sep 29 2022 06:00:02 GMT+0530 (India Standard Time)

vikram vedha movie news

బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా పరిస్థితి ఉంది. బ్రహ్మాస్త్ర సినిమా తో మంచి వసూళ్లు సొంతం చేసుకున్న తర్వాత బాలీవుడ్ పరిస్థితి మెరు పడ్డట్లే అనుకుంటూ ఉండగా ఈ మధ్య మళ్లీ మునుపటి పరిస్థితి పునరావృతం అవుతున్నట్లుగా కనిపిస్తుంది.ఈనెల 30వ తారీకున రాబోతున్న అతి పెద్ద బాలీవుడ్ మల్టీ స్టారర్ మూవీ విక్రమ్ వేదా కి మినిమం బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు. ఎంతగా ప్రమోషన్ చేసినా కూడా ఇదేనా అన్నట్లుగా పరిస్థితి ఉంది. అసలు ఈ సినిమాకు ప్రమోషన్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతుంది. ప్రమోషన్ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి కానీ సినిమాకు బజ్ క్రియేట్ అవ్వలేదు.

ఉత్తరాదిన కాస్త అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయినా కూడా ఓవర్సీస్ లో అత్యంత దారుణమైన అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతుంది. తమిళ సినిమాలు ఈ వారం రెండు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ రెండు సినిమాలకు ఉన్న అడ్వాన్స్ బుకింగ్ అమెరికాలో విక్రమ్ వేదా సినిమాకు లేక పోవడం ఆశ్చర్యంగా ఉందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒక హిందీ సినిమా.. అది కూడా ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా పై పెచ్చు ఒక భారీ యాక్షన్ మాస్ సినిమా కి ఇదా అడ్వాన్స్ బుకింగ్ జరిగే తీరు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విక్రమ్ వేదా భారీ డిజాస్టర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఏమైనా బుకింగ్ కౌంటర్ వద్ద సందడి ఉంటుందేమో అని చిత్ర యూనిట్ సభ్యులు ఆశ పడుతున్నారు. మరి అది ఎంత వరకు వర్కౌట్ అయ్యేనో తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరికొన్ని గంటల్లో అమెరికాలో ఆట పడటం.. విక్రమ్ వేదా జాతకం తేలడం జరిగి పోతుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.