Begin typing your search above and press return to search.

ఉప్పెన 'రాయనం' ది ఫ్యామిలీ మ్యాన్‌

By:  Tupaki Desk   |   20 Jun 2021 9:30 AM GMT
ఉప్పెన రాయనం ది ఫ్యామిలీ మ్యాన్‌
X
దేశ వ్యాప్తంగా సూపర్ హిట్‌ అయిన ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్ కు ఇటీవలే సీక్వెల్‌ వచ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 2 హిందీలో ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతుంది. కొన్ని కారణాల వల్ల తెలుగు మరియు తమిళ డబ్బింగ్‌ వర్షన్‌ ల స్ట్రీమింగ్ నిలిపి వేశారు. ఫ్యామిలీ మ్యాన్‌ 2 లో సమంత పాత్ర విషయంలో తమిళులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వివాదం అవుతున్నా కూడా ఈ వెబ్‌ సిరీస్ ను విపరీతంగా చూస్తూనే ఉన్నారు. సీజన్‌ 2 చివర్లో మూడవ సీజన్ కూడా ఉంటుందని హింట్‌ ఇచ్చారు. రెండు సీజన్‌ లు సూపర్‌ హిట్ అయిన నేపథ్యంలో మూడవ సీజన్‌ ను మరీ ఎక్కువ ఆలస్యం చేయడం చేయకూడదని మేకర్స్ భావిస్తున్నారట.

రాజ్ అండ్‌ డీకే ల దర్శక ద్వయం వెబ్‌ సిరీస్ మూడవ సీజన్ కు సంబంధించిన వర్క్ ను ఆరంభించారని సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే మూడవ సీజన్ కు మరింతగా సౌత్‌ మెరుగులు అద్దాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సీజన్ 2 లో కేవలం సౌత్ నుండి సమంత మాత్రమే కనిపించింది. ఇక సీజన్ 3 లో మాత్రం సౌత్‌ స్టార్‌ నటుడు విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దర్శకులు రాజ్ మరియు డీకే లు ఇప్పటికే విజయ్‌ సేతుపతిని సీజన్ 3 కోసం సంప్రదించారని తెలుస్తోంది.

విజయ్‌ సేతుపతి సీజన్ 3 లో నటించడం వల్ల సౌత్‌ లో మరింతగా ది ఫ్యామిలీ మ్యాన్‌ కు బజ్‌ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆయన్ను నటింపజేయాలని భావిస్తున్నారట. ఉప్పెన సినిమా లో రాయనం పాత్రలో నటించి మెప్పించిన విజయ్‌ సేతుపతి తమిళంలో మాస్టర్‌ సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు. విజయ్‌ సేతుపతి విలక్షణ నటుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు కనుక ఫ్యామిలీ మ్యాన్‌ కు మరింత ఆకర్షణగా నిలుస్తాడని అంటున్నారు. ఈ వార్తలపై దర్శక ద్వయం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.