విశ్వనటుడి థ్రిల్లర్ మూవీలో మక్కల్ సెల్వన్..?

Tue May 18 2021 10:00:01 GMT+0530 (IST)

vijay sethupathi In Kamal Hasaan Movie

ప్రస్తుతం చిత్రపరిశ్రమలో యంగ్ డైరెక్టర్స్ హవానే నడుస్తుంది. సీనియర్ డైరెక్టర్స్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు. అందుకే యువదర్శకులు కొత్త కొత్త కథలతో - ఐడియాలతో సినిమాలు రూపొందిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. అలాంటి యంగ్ దర్శకులలో ఒకరు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం కోలీవుడ్ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లోకేష్. ఇప్పటివరకు మూడు సినిమాలే చేసాడు కానీ బాక్సాఫీస్ దగ్గర ఇంపాక్ట్ మాత్రం ఓ రేంజిలో క్రియేట్ చేసాడు. అందుకే ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు.లోకేష్ మేకింగ్ స్టైల్ నచ్చడంతో స్టార్ హీరోలే పిలిచిమరి అవకాశాలు ఇస్తుండటం విశేషం. నగరం సినిమాతో దర్శకుడుగా మారిన లోకేష్.. కార్తీతో ఖైదీ సినిమా రూపొందించి బాక్సాఫీస్ కలెక్షన్స్ వందకోట్లు కొల్లగొట్టాడు. అలాగే ఈ ఏడాది మాస్టర్ సినిమాతో మరో సంచలనం సృష్టించాడు. ఈ సినిమా ఏకంగా 200కోట్ల క్లబ్ లో చేరడం మరో విశేషం. ఇలా సినిమాకో రికార్డు క్రియేట్ చేసుకుంటున్నాడు లోకేష్. ఇప్పుడు 4వ సినిమాగా 'విక్రమ్' తెరకెక్కిస్తున్నాడు. విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. మొన్నటివరకు కమల్ ఎలక్షన్స్ కారణంగా షూటింగ్స్ లో పాల్గొనలేదు. ప్రస్తుతం ఎలక్షన్స్ ముగిసాయి.

కాబట్టి విక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటంటే.. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరో కాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్. ఇప్పటికే డైరెక్టర్ విజయ్ తో చర్చలు జరిపాడట. అయితే విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదివరకే విజయ్ మాస్టర్ సినిమాలో విలన్ గా చేసాడు. మరి ఈ థ్రిల్లర్ మూవీలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. త్వరలోనే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఈ సినిమాకు స్వయంగా కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.