Begin typing your search above and press return to search.

మనోడి బాలీవుడ్ డెబ్యూ షూట్ షురూ

By:  Tupaki Desk   |   14 Jan 2022 3:31 AM GMT
మనోడి బాలీవుడ్ డెబ్యూ షూట్ షురూ
X
ఘాజీ, అంతరిక్షం వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడమే కాకుండా పలు అవార్డులను రివార్డులను దక్కించుకున్నాడు. సంకల్ప్ రెడ్డి కేవలం రెండు సినిమాలతోనే ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. సంకల్ప్ రెడ్డితో సినిమాలు చేసేందుకు పలువురు స్టార్ హీరోలు ఆసక్తిగా ఉన్నారు.. ఆయన స్క్రిప్టు రెడీ చేస్తే వెంటనే డేట్లు ఇచ్చేందుకు వారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కానీ ఆయన మాత్రం విభిన్నమైన సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఒక్కో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటూ వస్తున్నాడు.

ఆ మధ్య ఒక వెబ్ సిరీస్ లోని ఓ ఎపిసోడ్ కి దర్శకత్వం చేసి ఆకట్టుకున్న సంకల్ప్ రెడ్డి గత కొన్నాళ్లుగా బాలీవుడ్లో సినిమాను తెరకెక్కించేందుకు గాను ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. ఆ సినిమా ఆయన సొంత బ్యానర్ లోనే చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్లో సంకల్ప్ రెడ్డి చేయబోతున్న మూవీ సాదా సీదా మూవీ కాదని సమాచారం అందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంకల్ప్ రెడ్డి హిందీ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. షూటింగ్ ప్రకటనతో సినిమా ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. సంకల్ప్ రెడ్డి బాలీవుడ్ డెబ్యూ సినిమాకు IB 71 అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. ఈ సినిమాలో విద్యుత్ జమాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

షూటింగ్ ప్రారంభమైన విషయం ను ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. దర్శకుడు మరియు ఆయన కలిసి చెస్ ఆడుతూ ఇంట్రెస్టింగ్గా సంభాషిస్తూ సినిమా కి క్లాప్ కొట్టడం జరిగింది. సినిమా షూటింగ్ ప్రారంభం అయిన సందర్భంగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త సంవత్సరం కొత్త సినిమా అంటూ చిత్ర యూనిట్ సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. యాక్షన్ హీరో ఫిల్మ్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ సినిమా నిర్మాణ సంస్థలు సమర్పకులుగా వ్యవహరించబోతున్నారు. పీరియాడిక్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఈ సినిమాలో ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. 1970 కాలం నాటి వాతావరణంలోకి ప్రేక్షకులను దర్శకుడు తీసుకోబోతున్నాడని టైటిల్ ని చూస్తుంటే అర్థమవుతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.