సైలెంటుగా పెళ్లాడేసిన లేడీ కమెడియన్

Tue Sep 14 2021 09:06:40 GMT+0530 (IST)

vidyullekha raman Marriage

తమిళ.. తెలుగు భాషల్లో కమెడియన్ గా మంచి పేరే సంపాదించిన అమ్మాయి విద్యుల్లేఖ రామన్. ఎటో వెళ్లిపోయింది మనసు రాజు గారి గది సరైనోడు సహా తెలుగులో ఆమె పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. తన సొంత ఇండస్ట్రీ అయిన కోలీవుడ్లో కూడా ఆమె బాగానే పాపులర్. దాదాపు పదేళ్లుగా ఆమె సినిమాల్లో నటిస్తోంది. లేడీ కమెడియన్లు బాగా అరుదైనపోయిన ఈ కాలంలో ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగడం విశేషమే. ఐతే ఈ మధ్య ఉన్నట్లుండి బాగా బరువు తగ్గి కొంచెం నాజూగ్గా తయారై అందరికీ పెద్ద షాకిచ్చిన విద్యుల్లేఖ.. ఇప్పుడు ఇంకో షాకిచ్చింది. చడీచప్పుడు లేకుండా ఆమె వివాహం చేసుకుంది. వరుడి పేరు..  సంజయ్ వాట్వానీ.చెన్నైకి చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన విద్యుల్లేఖ.. నార్త్ ఇండియన్ సింధు కుటుంబానికి చెందిన సంజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఐతే పెళ్లికి ఇరు కుటుంబాల అంగీకారం కుదిరిందట. చెన్నై ఈసీఆర్ రోడ్డులో ఉన్న ఓ స్టార్ హోటల్‌లో వీరి వివాహం ఇరు కుటుంబ సభ్యులు అతికొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది.

శనివారమే పెళ్లి జరగ్గా.. సమాచారం రెండు రోజుల తర్వాత బయటికి వచ్చింది. తమిళంలో కామెడీ క్యారెక్టర్ రోల్స్ ద్వారా పాపులర్ అయిన మోహన్ రామన్ కుమార్తె విద్యుల్లేఖ. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లోకి అడుగు పెట్టి.. తండ్రి కన్నా బిజీ ఆర్టిస్టు అయింది. బొద్దుగా ఉండటం వల్లే కామెడీ రోల్స్ బాగా అందుకున్న విద్యుల్లేఖ.. ఈ మధ్య అవకాశాలు వదులుకుని మరీ సన్నబడటానికి పెళ్లి వైపు అడుగులేయడమే కారణమన్నమాట.