ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో బాలీవుడ్ జంట..!

Tue Nov 29 2022 06:00:02 GMT+0530 (India Standard Time)

vicky kaushal and katrina kaif 1st anniversary celebration

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కత్రినా కైఫ్ ఇప్పటికీ తన ఫాం కొనసాగిస్తూనే ఉంది. అయితే రెండు దశాబ్దాల తన సినీ కెరీర్ లో ఎంతోమంది హీరోలతో లవ్ స్టోరీలు నడిపిన కత్రినా ఫైనల్ గా బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ ని పెళ్లాడింది. 2021 డిసెంబర్ 9న ఫ్యామిలీ మెంబర్స్ కొద్దిమంది సెలబ్రిటీస్ సమక్షంలో విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ ల మ్యారేజ్ జరిగింది. ఈ ప్రేమ జంట త్వరలో వారి మొదటి యానివర్సరీ జరుపుకోనున్నారు.  ఫస్ట్ యానివర్సరీ చాలా గ్రాండ్ గా చేయాలని అనుకున్న ఈ జోడీ అదంతా పక్కన పెట్టేసి సైలెంట్ గా మాల్దీవ్స్ చెక్కేశారు. మాల్దీవ్స్ లో విక్కీ కౌశల్ కత్రినా వెడ్డింగ్ యానివర్సరీ ప్లాన్ చేశారు.

ఈమధ్య మన స్టార్స్ అంతా మాల్దీవ్స్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మాట్లాడితే మాల్దీవ్స్ వెళ్లి అక్కడ బీచ్ ఫోటోలు షేర్ చేసి హంగామా చేస్తున్నారు. విక్కీ కత్రినాల జోడీ కూడా మాల్దీవ్స్ లోనే తమ ఫస్ట్ యానివర్సరీ ప్లాన్ చేశారు.

భర్తతో పూల్ సైడ్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది కత్రినా కైఫ్. క్యాట్ విక్కీ కౌశల్ జంట చూడముచ్చటగా ఉంది. పెళ్లైనా సరే ఇద్దరు తమ సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. కత్రినా రీసెంట్ గా ఫోన్ బూత్ సినిమా చేయగా ప్రస్తుతం మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. విక్కీ కౌశల్ కూడా వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తున్నాడు. అయితే ఆఫ్ స్క్రీన్ ఈ పెయిర్ ఆన్ స్క్రీన్ కూడా నటించి ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నారు.

ఆఫ్టర్ మ్యారేజ్ కత్రినా కెరీర్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇంకా చెప్పాలంటే తన కెరీర్ స్టార్టింగ్ లో రెచ్చిపోయినట్టుగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది అమ్మడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.