Begin typing your search above and press return to search.

వీరసింహారెడ్డి.. లేటెస్ట్ కలెక్షన్స్ ఎంతంటే..

By:  Tupaki Desk   |   23 Jan 2023 5:57 PM GMT
వీరసింహారెడ్డి.. లేటెస్ట్ కలెక్షన్స్ ఎంతంటే..
X
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా మొదటి వారం అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. సెకండ్ కలెక్షన్స్ కొద్దిగా డ్రాప్ అయిన కూడా మళ్ళీ పుంజుకున్నాయి. దీంతో భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్లింది.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అన్నాచెల్లి సెంటిమెంట్ భాగా కనెక్ట్ అయిపొయింది. ఇప్పటికే చూసిన కథనే అయినా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తో బాలకృష్ణ నుంచి ఫ్యాన్స్ ఎలాంటి అంశాలు కోరుకుంటారో అన్ని కూడా పుష్కలంగా ఈ సినిమాలో ఉన్నాయి. అయితే లాంగ్ రన్ లో సినిమా కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ ని అందుకోలేదని చెప్పాలి. ఇక ఈ సినిమా కలెక్షన్స్ వివరాలు చూసుకుంటే నిజాం ఏరియాలో 16.50 కోట్లు కలెక్ట్ చేసింది. సీడెడ్ లో 14.30 కోట్లు, యూఏలో 8.45 కోట్లు,గుంటూరులో 5.95 కోట్లు కలెక్ట్ చేసింది.

తూర్పు గోదావరిలో 5.47 కోట్లు, పశ్చిమ గోదావరిలో 4.07 కోట్లు, కృష్ణా జిల్లాలో 4.58 కోట్లు, నెల్లూరులో 2.92 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో 62.24 కోట్ల షేర్ ని రాబట్టింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.50 కోట్లు, ఓవర్సీస్ లో 5.85 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తానికి వరల్డ్ వైడ్ గా 72.59 కోట్లు కలెక్షన్స్ ని వీరసింహారెడ్డి రాబట్టింది. ఇక మొదటి వారం రోజుల కలెక్షన్ చూసుకుంటే 67.20 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ 75 కోట్లు మేరకు జరిగింది.

ఇప్పటి వరకు ఓవరాల్ గా 72.59 కోట్లు కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే సెకండ్ వీక్ లో సినిమా కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. ఈ నేపధ్యంలో బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టమే అనిపిస్తుంది. అయితే నిర్మాతలకి మాత్రం ఈ సినిమా ఓవరాల్ శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కలిపి మంచి ప్రాఫిట్ తీసుకొచ్చింది అనే మాట ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.