బటన్ లెస్ లుక్ లో హీటెక్కించిన జబర్ధస్త్ బ్యూటీ

Thu Nov 26 2020 14:20:11 GMT+0530 (IST)

Jabardast beauty in a buttonless look

పట్టు విడుపు ఉంటేనే గ్లామర్ రంగంలో రాణించగలరు. గ్లామర్ ఎలివేషన్ కి ఎక్స్ పోజింగుకి ఏమాత్రం వెనకాడకూడదు ఇక్కడ. ఇరుగు పొరుగు భాషల భామల నుంచి.. ముంబై క్యాట్ వాక్ గాళ్స్ వరకూ తీవ్రమైన పోటీని ఎదుర్కొని తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది.అయితే నిన్నమొన్నటివరకూ తెలుగమ్మాయిల కట్టుబాట్లు ఎంతో ఇబ్బందికర పరిణామంగా కనిపించాయి. దానివల్ల కూడా కొందరు ట్యాలెంట్ ఉన్నా స్టార్ డమ్ ని సొంతం చేసుకోలేకపోయారు. కానీ ఇటీవల తెలుగమ్మాయిల మైండ్ సెట్ లో ఎంతో మార్పు కనిపిస్తోంది. కానీ కాలక్రమేణా మార్పు స్పష్ఠంగా కనిపిస్తోంది. అలాగే బుల్లితెర యాంకర్లు సైతం కథానాయికలకు ఏమాత్రం తీసిపోకుండా ఎక్స్ పోజింగ్ తో అదరగొడుతున్న తీరు చర్చనీయాంశమైంది.

అనసూయ- రేష్మి లాంటి టాప్ క్లాస్ యాంకర్లు ఇప్పటికే గ్లామర్ ఎలివేషన్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు అదే బాటలో టీవీ యాంకర్ కం నటి వర్ష లేటెస్ట్ ఫోటోషూట్ తో అదరగొట్టింది. జబర్దస్త్ లోని హైపర్ ఆది స్కిట్స్ లో నటించిన వర్షకు మంచి నటిగా గుర్తింపు దక్కింది. ఇటీవల ఓ వివాదాస్పద వీడియోతో అనసూయపై పంచ్ వేయడంతో ఆమెను మరింత పాపులర్ చేసింది. ఆరబోతలో తానేం తక్కువ కాదని నిరూపిస్తూ తాజా ఫోటోషూట్ లో వర్షా తన చొక్కా బటన్లను ఓపెన్ చేయడం కుర్రకారులో హాట్ టాపిక్ గా మారింది.

వర్షా తడి పొడి అందాలతోనూ కవ్విస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోషూట్ వెనక పెద్ద లక్ష్యమే ఉన్నట్టుగా అర్థమవుతోంది. వర్ష హీరోయిన్ గా అవకాశాల కోసమే ఇలా చెలరేగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రీజన్ లేకుండా లాజిక్ తెలియకుండా తెలుగమ్మాయిలు బోల్డ్ లుక్ లో కనిపించడం అరుదు. వర్షలో ప్రతిభకు కొదవేమీ లేదు కాబట్టి మన దర్శకనిర్మాతలు అవకాశాలు కల్పిస్తారేమో చూడాలి.