వర్మ మాకు ఆ విషయం తెలియదనుకున్నావా?

Wed Jul 08 2020 14:00:28 GMT+0530 (IST)

varma cheating techniques for his thriller movie

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏటీటీ కోసం అంటూ వారంకు ఒక సినిమాను విడుదల చేసేందుకు వరుసగా చిత్రాలను మొదలు పెట్టాడు. ఇటీవలే క్లైమాక్స్ ఇంకా ఎన్‌ఎన్‌ఎన్ చిత్రాలను విడుదల చేసిన వర్మ త్వరలో మర్డర్ ఇంకా థ్రిల్లర్ సినిమాలను తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయన్నాడు. థ్రిల్లర్ చిత్రంతో అప్సర రాణి అనే కొత్త అమ్మాయిని  పరిచయం చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు.ఒడిశ్శాకు చెందిన ఈ అమ్మాయి అందంను ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాను అంటూ ఆమెపై వరుసగా ట్వీట్స్ పెట్టాడు. ఆమెకు చెంపపై గట్టిగా ముద్దు పెడుతున్న ఫొటోను కూడా షేర్ చేశాడు. మొత్తానికి ఓవర్ నైట్ లో అప్సర రాణిని స్టార్ చేశాడు. అయితే తాజాగా ఆమె గురించి నెట్టింట అనే విషయాలు ప్రచారం జరుగుతున్నాయి.

వర్మ చెబుతున్నట్లుగా ఆమె కొత్త అమ్మాయి ఏమీ కాదు. ఇండస్ట్రీలో కొంత కాలంగా ఉంది. తెలుగులో ఆమె కొన్ని సినిమాలు కూడా చేసింది. అవి పెద్ద సినిమాలు కాకపోవడంతో ఆమెకు సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. ఆమె అసలు పేరు కూడా అప్సర కాదని ఆమె పేరు అంకిత మహారాణా. అంకిత గురించి ఇంకా కొన్ని విషయాలు కూడా నెట్టింట ప్రచారం జరుగుతున్నాయి.

వర్మ మాత్రం ఆమె కొత్త అమ్మాయి ఫ్రెష్ ఫేష్ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాడు. ఇంటర్నెట్ ప్రాచుర్యం ఇంతగా పెరిగిన సమయంలో జనాలను వర్మ మోసం చేయాలనుకోవడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి వర్మ దీనికి ఏమని వివరణ ఇస్తాడో చూడాలి.