వారిసు.. సీరియల్ టాక్ తో 250 కోట్లు

Mon Jan 23 2023 19:06:47 GMT+0530 (India Standard Time)

varasudu 250 crore collection

ఇళయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వారిసు. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సుమారు వంద కోట్ల వరకు ఈ సినిమాని పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. ఇక విజయ్ కి గత కొంత కాలం నుంచి వరుస హిట్స్ పడుతున్న సంగతి తెలిసిందే. వారిసు సినిమాకి ముందుగా విజయ్ బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని భారీ కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సినిమా అంటే మొదటి వీకెండ్ లోనే సినిమాకి పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది అనేది అందరికి తెలిసిందే. అయితే వారిసు సినిమా విషయుంలో ఆ ఫీట్ రిపీట్ కాలేదు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ఈ సినిమా ఒక్క తెలుగులో తప్ప మిగిలిన అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి రోజు ఎవరేజ్ టాక్ వచ్చింది.

అయితే దశాబ్దాల గ్యాప్ తర్వాత విజయ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా కావడంతో విజయ్ ఫ్యాన్స్ కాస్తా డిజపాయింట్ అయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి మూవీ భాగా కనెక్ట్ అయ్యింది. సినిమాలో విజయ్ ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా వారిసు సినిమాలో భాగానే ఉన్న రొటీన్ స్టొరీ అనే టాక్ వచ్చింది. అయినా కూడా సంక్రాంతి సీజన్ కావడంతో వారిసు సినిమా చూడటానికి ప్రేక్షకులు భాగానే వచ్చాయి.

ఈ నేపధ్యంలో కలెక్షన్స్ కూడా భాగానే వచ్చాయి. 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 258.25 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే విజయ్ కెరియర్ లో మరోసారి రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా వారిసు నిలిచింది. అయితే ఈ మూవీ  137.90 కోట్ల బిజినెస్ వరల్డ్ వైడ్ గా జరిగింది. అయితే ఇప్పటి వరకు 139 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ తో సంక్రాంతి రేసులోకి వచ్చిన ఈ సినిమా 131.80 కోట్ల వరకు ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ గా చూసుకుంటే కోలీవుడ్ లో 114.05 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.

 తెలుగు రాష్ట్రాలలో  25.5 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇక  కర్ణాటకలో 13.75 కోట్లు కేరళలో 11.55 రెస్ట్ ఆఫ్ ఇండియాలో 13.25 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో  80.10 కోట్ల గ్రాస్ ని వారిసు మూవీ రాబట్టింది. అయితే మామూలుగా చూసుకుంటే భారీగానే కలెక్షన్స్ ని ఈ సినిమా రాబట్టిన బ్రేక్ ఎవెన్ టార్గెట్ ని మాత్రం అందుకోలేక పోయింది. ఇక ఈ మూవీ బ్రేక్ ఎవెన్ అందుకోవాలంటే మరో 7.20 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా థీయాట్రికల్ రైట్స్ ని ముందుగానే అమ్మేయడంతో దిల్ రాజు మాత్రం వారిసు సినిమాతో భాగానే ఆర్జించారు. ఓవరాల్ గా చూసుకుంటే ఎవరేజ్ టాక్ తో బ్రేక్ ఎవెన్ దగ్గరకి వచ్చి ఆగిపోయే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.