Begin typing your search above and press return to search.

వీరయ్య ఈవెంట్ లో తొక్కిసలాట

By:  Tupaki Desk   |   28 Jan 2023 7:55 PM GMT
వీరయ్య ఈవెంట్ లో తొక్కిసలాట
X
ఈ సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విడుదలై విజయం సాధించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ వీరసింహారెడ్డిగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్నే కొట్టాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి... సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని మెగా అభిమాని బాబీ డైరెక్ట్ చేయగా... మైత్రీ మూవీ మేకర్స్ సంస్థం నిర్మించింది.

ఈ చిత్రంలో మెగాస్టార్ ఎనర్జీకి తోడుగా మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జీ తోడవడంతో సినిమాకు ప్లస్ అనే చెప్పవచ్చు. ఇక ఈ రెండు సినిమాల్లో హీరోయిన్గా శృతి హాసనే నటించింది. బాలయ్యకు తమన్ మ్యూజిక్ అందించగా.. చిరంజీవి సినిమాకు దేవీ శ్రీ అందించాడు.తాజాగా ఈ చిత్రం హనుమకొండలో వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకల్ని జరుపుకుంటోంది. ఎంతో గ్రాండ్ గా చేపడుదామని అనుకున్న నేపథ్యంలో ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది.

ఈ చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ వేడుకల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒక్కసారిగా గేట్లను తోసుకుని ముందుకెళ్లడంతో చిరంజీవి అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఇందులో చిన్నారులు కూాడా ఉన్నట్లు సమాచారం. సక్సెస్ వేడుకల్లో ఇలా జరగడంతో... మెగా అభిమానుల్లో కాస్త గందరగోళం, టెన్షన్ కు గురువుతున్నారు.

మొన్న బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ వేడుకల్లో బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. బాలకృష్ణ అక్కినేనిపై చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చగా మారింది. అటు అక్కినేని వారసులు సైతం బాలయ్య కామెంట్స్ పై ఓ పోస్ట్ పెట్టారు. ఎంతో వివాదం తర్వాత బాలకృష్ణ రియాక్షన్ తో కాస్త సద్దు మణిగిందని తెలుస్తోంది. ఇప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో ఇలా జరగడంతో... బాలయ్యకు కామెంట్స్ తో వివాదంలో పడితే.. చిరంజీవి.. వేడుకల్లో జరిగిన అపశృతితో ఏంటీ ఇలా జరిగిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ రెండు సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. రెండు సినిమా వేడుకల్లో ఇలా జరగడంపై ఫ్యాన్స్ అయితే ఆందోళనకు గురవుతున్నారు. చూడాలి ఇక ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.