టాలీవుడ్ కి OTT ఒక మరణ శాసనం?

Mon Jul 06 2020 19:00:09 GMT+0530 (IST)

us box office collections after ott will this be death knell


2020 తెలుగు సినిమా సహా వినోద పరిశ్రమలకు ఏమాత్రం కలిసి రాలేదు. మహమ్మారీ క్రైసిస్ ప్రపంచాన్ని ఒణికించడంతో పాటు టాలీవుడ్ ని అంపశయ్యపైకి తీసుకెళ్లిందనే చెప్పాలి. నాలుగు నెలలుగా షూటింగుల్లేవ్.. రిలీజుల్లేవ్.. భవిష్యత్ లో ఎప్పటికి తిరిగి యథాస్థితి వస్తుందో చెప్పలేని ధైన్యం.దీనికి తోడు థియేటర్ వ్యవస్థకు ధీటుగా ఓటీటీ వ్యవస్థ వేళ్లూనుకోవడం ప్రమాదకర సంకేతాల్ని ఇస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లు.. స్మార్ట్ టీవీల్లో ఓటీటీ- డిజిటల్ కు అడిక్ట్ అయిన ప్రేక్షకుల్ని తిరిగి థియేటర్లు తెరిచాక రప్పించడమెలా? అన్నది ఫజిల్ గా మారనుందని అంచనా వేస్తున్నారు. ఇటు ఏపీ - నైజాం మార్కెట్లు సహా అటు అమెరికా లాంటి కీలక మార్కెట్ పై ఓటీటీ ప్రభావం ఏమేరకు పడనుంది? అన్నది టాలీవుమ్ మేకర్స్ అంచనా వేస్తున్నారు. తాజా రివ్యూల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఒకవేళ ఓటీటీ వ్యవస్థకు జనం పూర్తిగా అడిక్ట్ అయ్యి థియేటర్లను మర్చిపోతే ఏం చేయాలి? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఇదే జరిగితే చిన్న- మధ్యస్థ బడ్జెట్ చిత్రాలకు ఇది మరణశాసనం అనే చెప్పాలి. భారీ బడ్జెట్లతో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాల వరకూ బతకగలిగినా.. చిన్న రేంజ్ సినిమాల పరిస్థితి ఏం కావాలి? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

2020లో రిలీజ్ కోసం వెయిటింగులో ఉన్న దాదాపు 20 సినిమాలు చిన్న- మిడ్ రేంజ్ బడ్జెట్లతో తెరకెక్కినవే. ఇవన్నీ థియేటర్లలో కంటే ఓటీటీల్లోకి వచ్చాకే చూడాలనుకుంటే పరిస్థితి ఏమిటి? అన్న విశ్లేషణ సాగుతోంది. ఓటీటీ ఒక రకంగా టాలీవుడ్ కి మరణ శాసనం అన్న విమర్శలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి. వైరస్ లాక్ డౌన్ అయిపోయాక థియేటర్లు తెరిచినా 70 శాతం మేర జనం థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తిగా లేరని ఓ సర్వే నివేదిక ఆశ్చర్యపరుస్తోంది. రెండు మూడేళ్ల పాటు వైరస్ భయాలు అలానే ఉంటే అది మరింత కష్టకాలానికి దారి తీస్తుంది. అయితే అలా జరగకూడదనే భావిద్దాం. ఒక రకంగా ఈ సవాల్ ని అధిగమించాలంటే కంటెంట్ తో కొట్టాలి. థియేటర్లలోకి వచ్చే సినిమాలకు ఓటీటీ సినిమాలు సమానం కావు అని నిరూపించాలి. అంటే క్రియేటర్స్ కి ఇది అతి పెద్ద ఛాలెంజ్ గా మారనుందనే చెప్పాలి.