కాంప్రమైజ్ అవ్వని రామ్ చరణ్

Sun May 29 2022 10:00:44 GMT+0530 (IST)

uncompromising Issue About Ramcharan

RRR సినిమా తో భారీ విజయాన్ని అందుకున్న సంతోషం రామ్ చరణ్ కు కనీసం ఒక నెల కూడా ఉండలేదు. ఆ సినిమా సక్సెస్ అయింది అని సంబరాలు చేసుకుంటున్న సమయంలో నే ఆచార్య సినిమాతో ఒక్కసారిగా దెబ్బ పడింది. కనీసం సినిమా యావరేజ్ కలెక్షన్స్ అందుకుంటుంది అంటే అది కూడా కాకుండా పెట్టిన పెట్టుబడిలో సగంలో సగం కూడా వెనక్కి రాలేదు. దాదాపు 70 కోట్ల వరకు నష్టం వచ్చినట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపించింది.ఇక ఆ దెబ్బ నుంచి కోలుకునేందుకు రామ్ చరణ్ ప్రస్తుతం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని అనుకుంటున్నాడు. కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నాడు ఎందుకంటే రామ్ చరణ్ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే.

రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న తన 15 సినిమాపై అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఆ తర్వాత చేయబోయే స్క్రిప్ట్ విషయంలో మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని చరణ్ ఆచార్య ప్రమోషన్ లో తెలియజేశాడు. అయితే ఆ దర్శకుడు కూడా బాలీవుడ్లో జెర్సీ సినిమాను రీమేక్ చేసి ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్నాడు.

అయినప్పటికీ రామ్ చరణ్ అతనితో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే స్క్రిప్ట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఒక బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని నమ్మకంగా అనిపించినా తర్వాత షూటింగ్ మొదలు పెట్టాలి అని ఇటీవల మరొకసారి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

దర్శకుడు కూడా రామ్ చరణ్ కు నమ్మకం కలిగేలా మరొకసారి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసే రెడీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.