టాప్ స్టోరి: మనసున్న మహారాజులు టాలీవుడ్ హీరోలు

Wed Oct 21 2020 09:15:30 GMT+0530 (IST)

tollywood celebrities donate to telangana cm relief fund

హైదరాబాద్ లో కుంభవృష్టి జనజీవనాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసినదే. సెంటీమీటర్ల కొద్దీ కురిసిన భారీ వర్షాలు చాలా ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగించాయి. నిర్మాణాల పరంగా పెద్ద ఎత్తున నాశనానికి కారణమయ్యాయి. నగరం మౌలిక సదుపాయాలు బలంగా ఉన్నా.. రోడ్లు .. డ్రైనేజీ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు నగరం మునకలు వేయడానికి కారణమని తేలింది. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పలువురు సెలబ్రిటీలు స్పందించి విరివిగా విరాళాలిచ్చారు. ప్రకృతి వైపరీత్యాల వేళ మేమున్నాం అంటూ ఆదుకునే టాలీవుడ్ సెలబ్రిటీలు ఈసారి కూడా అంతే ఉదారంగా మంచి మనసును చాటుకుంటున్నారు.ఇప్పటికే చాలామంది స్టార్లు సెలబ్రిటీలు డబ్బును విరాళంగా ఇస్తున్నారు. పరిశ్రమలో కొందరు అగ్ర హీరోలు కోట్లు లక్షల్లో డొనేషన్లు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి-నాగార్జున- మహేష్- రామ్ చరణ్- ఎన్టీఆర్-  రామ్ ఇలా హీరోలంతా విరాళాలు ప్రకటించారు. కూ మెగాస్టార్ చిరంజీవి.. మహేష్ ఇరువురు సిఎం సహాయ నిధికి చెరో కోటి విరాళం ఇచ్చారు. కింగ్ నాగార్జున.. యంగ్ యమ ఎన్టీఆర్ చెరో 50లక్షల చొప్పున సీఎం నిధికి డొనేట్ చేశారు. ఈ జాబితాలో  తాజాగా ప్రభాస్ పేరు చేరింది. సీఎం సహాయ నిధికి 1 కోటి 50 లక్షలు విరాళంగా ఇచ్చారు ప్రభాస్.

హీరో రామ్ పోతినేని  ఇతర సినీ ప్రముఖులు రూ .25 లక్షలు చొప్పున డొనేట్ చేశారు. విజయ్ దేవరకొండ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు 10లక్షల చొప్పున డొనేషన్ ఇచ్చారు. ఇండస్ట్రీలో పలువురు చిన్న స్టార్లు టెక్నీషియన్లు సైతం తమ వంతు సాయానికి ముందుకు వస్తుండడం విశేషం. స్టార్ల స్పందన అద్భుతం. ఇంతకుముందు కేరళ వరదలు .. చెన్నయ్ వరదల్లోనే ఇంతే గొప్ప ధాతృహృదయాన్ని చాటుకున్న ఘనత మన స్టార్లకు ఉంది.