ఎక్స్ పోజింగ్ లో ఓ రేంజులో చెలరేగిన టీవీ నటి

Sun Oct 24 2021 16:00:01 GMT+0530 (IST)

tina datta Latest Picture

తొడుక్కునే వాటిలో కాదు యాటిట్యూడ్ లోనే ఉంది అసలు సంగతి..!బాలీవుడ్ లో `బిగ్ బాస్ సీజన్ 14` తో ఫేమస్ అయిన బ్యూటీ టీనా దత్ లేటెస్ట్ కొటేషన్ ఇది. బెంగాలీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఇప్పటికీ నటిగా అంతగా పాపులర్ కాలేకపోయినా సోషల్ మీడియా స్టంట్ లో అస్సలు తగ్గడం లేదు. ఓ వైపు సినిమా ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు బుల్లి తెరపై బిజీ నటిగా కొనసాగుతోంది.  టెలివిజన్ షోలతోనే  టీనా  ఎక్కువగా ఫేమస్ అయింది.  మొదట్లో కొన్ని తప్పటడుగులు పడినా కాలక్రమేణా కలర్స్ టీవీని శాషించే స్థాయికి రీచ్ అయింది. ఆమె ఎంట్రీ తో కలర్స్ టీవీ ఖ్యాతి రెట్టింపు అయింది. ఆ రకంగా బుల్లి తెరపై తనదైన మార్క్ వేసింది. అటుపై కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించింది. కానీ అక్కడ అంతగా రాణించలేకపోయింది.అలాగని సంకల్పాన్ని వదులుకోలేదు. ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవలే బిగ్ సీజన్ -14 లో ఛాన్స్ అందుకుని కొంచెం గుర్తింపు  సంపాదించింది. ఈ నేపథ్యంలో అమ్మడు వరుస ఫోటో షూట్లపైనా ప్రత్యేకంగా ఏకాగ్రత పెట్టినట్లు కనిపిస్తోంది. కొద్ది రోజులు తన లో సమ్ థింగ్ స్పెషల్ ని ఆవిషర్కించే ప్రయత్నాల్లో సైతం బిజీగానే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెంప్టింగ్ ఫోటోషూట్లతో ఇన్ స్టా ఫాలోవర్స్ ని హీటెక్కిస్తోంది. తాజాగా అమ్మడు మరోసారి కాకలు రేపే ఫోటోలతో విరుచుకు పడింది. బూడిద రంగు ప్లెయిడ్ బ్లేజర్ లో బ్లాక్ షార్ట్ ధరించి స్కిన్ టోన్డ్ బాడీ తో  టెంప్టింగ్ లుక్ లో ఆకట్టుకుంది. రైన్ స్టోన్ అలంకారంతో టీనా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వెనుక షాడో లుక్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉంది.

ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గామారింది. టీనా ఫాలోవర్స్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. టీవీ నటి మరీ ఈ రేంజులో చెలరేగిందేమిటో! అంటూ ఈ ఫోటోపై యూత్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. టీనా హైట్ పై కూడా కామెంట్లు పడుతున్నాయి. ఈ ఫోటో సెషన్ కోసం టీనా వాడిన హై హీల్స్ సైతం చర్చకొచ్చాయి. అమ్మడు ధరించిన హై హిల్స్ కాళ్లను మరీ మెలితిప్పేసాయి అంటూ ఓ ఫాలోవర్ కామెంట్ చేసాడు. టీనా బాలీవుడ్ లో పరిణీత అనే సినిమాతో చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరో ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం వేడెక్కించే ఫోటోషూట్లతో ప్రయత్నంలో వేగం పెంచింది.