నేను వర్జిన్ ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అంటూ హీరోయిన్ కు ఫ్యాన్ ప్రపోజల్

Wed Jul 08 2020 13:40:11 GMT+0530 (IST)

tillotama shome shocking instagram post on love praposel

బాలీవుడ్ నటి తిలోత్తమ షోమ్ హీరోయిన్ గా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాని ఈమెకు హీరోయిన్ గా బ్రేక్ మాత్రం రాలేదు. నాలుగు పదులు దాటిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతుంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక అభిమాని పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో ఆ అభిమాని ఆమెకు వింత పద్దతిలో ప్రపోజ్ చేశాడు. కాని తిలోత్తమ మాత్రం అతడికి అంతకంటే విభిన్నమైన తీరుతో షాక్ ఇచ్చింది.తిలోత్తమకు ఒక అభిమాని సోషల్ మీడియా ద్వారా పెళ్లి ప్రపోజల్ చేశాడట. మేడం నేను ఇంకా వర్జిన్ మీరు ఒప్పుకుంటే మిమ్ములను పెళ్లి చేసుకుంటాను. జీవితాంతం మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను వెజిటేరియన్ కూడా. నా గురించి మీరు ఎలా తెలుసుకున్నా ఓకే. బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేసుకోవచ్చు అలాగే లై డిటెక్టర్‌తో కూడా పరీక్ష చేసుకుని నన్ను పరీక్షించుకోండి. దేనికి అయినా నేను సిద్దంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

అతడు చేసిన మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తిలోత్తమ అలాంటి అవసరం లేదు బ్రదర్ బైబై అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయమై నెటిజన్స్ ఆమెను ట్రోల్స్ చేస్తుండగా మరికొందరు మాత్రం ఆమెకు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి తిలోత్తమ ఫ్యాన్ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.