Begin typing your search above and press return to search.

'ఆచార్య'లో ఆ మూడు సీన్స్ కి విజిల్స్ కొట్టకుండా ఉండలేరట!

By:  Tupaki Desk   |   5 March 2021 1:30 AM GMT
ఆచార్యలో ఆ మూడు సీన్స్ కి విజిల్స్ కొట్టకుండా ఉండలేరట!
X
మెగా అభిమానులందరినీ ఇప్పుడు 'ఆచార్య' సినిమా ఊరిస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. డిఫరెంట్ లుక్ తో చిరంజీవి కనిపించనున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. 'ఖైదీ నెంబర్ 150' తరువాత చిరంజీవి సరసన కాజల్ నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో చరణ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తుండగా, ఆయన జోడీగా పూజా హెగ్డే అలరించనున్న సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.


కొరటాల 'ఆచార్య' సినిమాకు అనేక విశేషాలను జోడిస్తూ వెళుతున్నాడు. అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని, అన్ని అంశాలను మేళవిస్తూ వెళుతున్నాడు. అందులో భాగంగా ఆయన డిజైన్ చేసిన మూడు సన్నివేశాలు మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తాయని చెబుతున్నారు. చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్ ఒక రేంజ్ లో ఉంటుందట. ఇంతవరకూ చిరంజీవి చేసిన సినిమాల్లో ఎందులోనూ ఎరుగని ఇంట్రడక్షన్ ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. ఈ ఇంట్రడక్షన్ సీన్ కు విజిల్ కొట్టని వాళ్లు .. క్లాప్స్ కొట్టనివాళ్లు దాదాపుగా ఉండరని చెబుతున్నారు.


అలాగే చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కూడా మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు. చరణ్ కి కూడా తన ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగా నచ్చిందని అంటున్నారు. పవర్ఫుల్ సీన్లో ఆయన ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు. ఆయన చెప్పే ఫస్టు డైలాగ్ కూడా ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇక మూడవ సీన్ .. ఇంటర్వెల్ బ్యాంగ్. ఈ సన్నివేశం ఆడియన్స్ ఊపిరిబిగబట్టేలా ఉంటుందనీ, ఆ తరువాత కథపై ఉత్కంఠను రేకెత్తిస్తుందని చెబుతున్నారు. ఈ మూడు సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. మే 13న వస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో జాతర చేస్తుందో చూడాలి మరి.