Begin typing your search above and press return to search.

ప్రియానిక్.. భార్య‌కు వైన్ బాటిల్ అందించిన ఉత్త‌మ భ‌ర్త‌

By:  Tupaki Desk   |   23 Jan 2021 11:30 PM GMT
ప్రియానిక్.. భార్య‌కు వైన్ బాటిల్ అందించిన ఉత్త‌మ భ‌ర్త‌
X
భార‌తీయ సాంప్ర‌దాయం.. స‌నాత‌న ధర్మం ఒప్పుకోని ఒక క‌ఠిన‌ నిజం ఇది. అవును.. భార్య‌కు భ‌ర్త స్వ‌యంగా వైన్ బాటిల్ అందించారు. ఆపై పెగ్గు వేసి చీర్ చెప్పారు!! ఆ విష‌యాన్ని ఎంతో ఆనందంగా చెప్పుకుంది ఆ భార్యామ‌ణి. ఇంత‌కీ ఈ జోడీ ఎవ‌రో చెప్పాల్సిన ప‌నే లేదు.

అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా అలియాస్ పీసీ. ప్రియాంక చోప్రా జోనాస్ న‌టించిన `ది వైట్ టైగర్` నెట్ ఫ్లిక్స్ లో విడుదల సంద‌ర్భంగా ఈ జంట ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ది వైట్ టైగర్ ను గత రెండు రోజులుగా ఆన్ లైన్ లో విస్త్ర‌తంగా ప్రచారం చేసింది ఈ జంట‌. రిలీజ్ అనంత‌రం ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ ప్రశంసలు అందుకుంది.

ది వైట్ టైగ‌ర్ చిత్రం విడుదల వేడుకల్లో భాగంగా నిక్ త‌న స‌తీమ‌ణి ప్రియాంక చోప్రాకు వైన్ బాటిల్ ‌ను అందించారు. ఆ ఫోటోని స్వ‌యంగా షేర్ చేసుకున్న పీసీ ``అత్యుత్తమ భర్త! నేను నిన్ను ప్రేమిస్తున్నాను..`` అంటూ వ్యాఖ్యను జోడించింది. నిక్ ని వైన్ ని కూడా ప్రేమిస్తున్నానని పీసీ చెప్పుకొచ్చింది. నీలం- నలుపు- తెలుపు పారదర్శక రంగులలో బెలూన్ల మధ్య ఆమె వైన్ బాటిల్ పట్టుకున్న ఫోటో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. `ది వైట్ టైగర్` కి బాటిల్ ద్వారా కూడా ప్ర‌చారం చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.

ది వైట్ టైగర్ చిత్రం అదే పేరుతో అరవింద్ అడిగాస్ ర‌చ‌న ఆధారంగా తెర‌కెక్కింది. బుకర్ బహుమతి పొందిన ఈ నవల అత్యధిక కాపీలు అమ్ముడై సంచ‌ల‌నం సృష్టించింది. ఆస్కార్లు గెలుచుకున్న మ‌న‌సు దోచిన `స్లమ్ డాగ్ మిలియనీర్`‌కు పూర్తి ఆపోజిట్ కోణాన్ని ఆవిష్క‌‌రించే చిత్ర‌మిది. ముంబై స్ల‌మ్ముల్లో ఇండియ‌న్ల ధీన స్థితిని స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ ఆవిష్క‌రిస్తే.. అందుకు పూర్తి భిన్న‌మైన క‌థ‌నంతో ది వైట్ టైగ‌ర్ రూపొందింది.

ఆదర్శ్ గౌరవ్- ప్రియాంక చోప్రా- రాజ్ కుమార్ రావు ప్రధాన‌ పాత్రలలో నటించారు. ఈ చిత్రం ధనవంతులైన భారతీయ జంట వ‌ద్ద ప‌ని చేసే డ్రైవర్ కథను చెబుతుంది. ఒక డ్రైవ‌ర్ పేదరికం నుండి తప్పించుకోవడానికి తన తెలివి తేట‌లు.. మోసపూరిత ఆలోచ‌న‌ల్ని ఎలా పెట్టుబ‌డి పెట్టి ఒక‌ వ్యవస్థాపకుడిగా ఎదిగాడు.. ఏం చేశాడ‌న్న‌ది థీమ్ లైన్.

ఈ చిత్రం విడుదలకు ముందే కోర్టు కేసులో చిక్కుకుంది. అయితే విడుదలకు కొన్ని గంటల ముందు ఈ సినిమాను నెట్ ‌ఫ్లిక్స్ లో ప్ర‌దర్శించ‌కుండా నిషేధించాలన్న అత్యవసర పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మార్చి 2009 లో సినిమా రైట్స్ ని అడిగా నుండి కొనుగోలు చేసిన అమెరికన్ చలనచిత్ర నిర్మాత జాన్ ఎన్ హార్ట్ జూనియర్ చేసిన దరఖాస్తును తోసిపుచ్చింది కోర్టు.