Begin typing your search above and press return to search.

సుజీత్ ని ప‌వ‌న్ ఫ్యాన్స్ అందుకే ట్రోల్ చేయ‌డం లేదా?

By:  Tupaki Desk   |   4 Dec 2022 3:33 PM GMT
సుజీత్ ని ప‌వ‌న్ ఫ్యాన్స్ అందుకే ట్రోల్ చేయ‌డం లేదా?
X
ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ కు మాత్ర‌మే విలువ ఎక్కువ‌. అదిలేదా ఇక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోరు. వ‌న్స్ స‌క్సెస్ నీ ద‌రి చేరిందా కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చి వెంట‌ప‌డ‌టం.. త‌మతో సినిమా చేయండ‌ని ఎగ‌బ‌డి మ‌రీ అడ్వాన్స్ లు ఇచ్చేయ‌డం ఇక్క‌డ కామ‌న్‌. కానీ డిజాస్ట‌ర్ సినిమాలు అందించిన ద‌ర్శ‌కుల‌కు మ‌ళ్లీ అవ‌కాశాలు రావ‌డం.. వారిని స్టార్ హీరోలు న‌మ్మ‌డం.. హీరోల న‌మ్మ‌కానికి త‌గ్గ‌ట్టుగా ఫ్యాన్స్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం అరుదుగా జ‌రుగుతూ వుంటుంది.

ఇటీవ‌ల వ‌రుస‌గా పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న ప్ర‌భాస్ ఒక్క‌సారిగా మారుతితో సినిమాకు రెడీ అయిపోవ‌డంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మారుతిని నెట్టింట ట్రోల్ చేశారు. త‌న‌తో సినిమా ప్ర‌మాద‌మ‌ని, అలాంటి సాహ‌సానికి పూనుకోవ‌ద్ద‌ని ప్ర‌భాస్ ని వేడుకున్నారు. అయినా స‌రే ప్ర‌భాస్ ఫ్యాన్స్ మాట విన‌కుండా మారుతికి అవ‌కాశం ఇచ్చి త‌న‌తో కెరీర్ లో తొలిసారి హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీకి శ్రీ‌కారం చుట్ట‌డం తెలిసిందే. ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి గురికావాల్సి వ‌స్తుంద‌ని చిత్ర బృందం ఈ మూవీని అథికారికంగా ప్ర‌క‌టించ‌డానికి భ‌య‌ప‌డింది.

ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మూడు షెడ్యూళ్ల‌ని పూర్తి చేసిన మారుతి మెరుపు వేగంతో ఈ మూవీని పూర్తి చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా వుంటే ప్ర‌భాస్ త‌ర‌హాలోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అభిమానులు ఊహించ‌ని, `సాహో`తో డిజాస్ట‌ర్ ని సొంతం చేసుకున్న సుజీత్ కు అవ‌కాశం ఇచ్చిన విష‌యం తెలిసిందే. సుజీత్ డైరెక్ష‌న్ లో డీవీవీ దాన‌య్య నిర్మాత‌గా ప‌వ‌న్ హీరో గా తెర‌పైకి రానున్న మూవీని ఆదివారం మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ ప్రాజెక్ట్ పై ప‌వ‌న్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి వ్య‌తిరేక‌త వ్య‌క్తం కాక‌పోవ‌డం విశేషం. కార‌ణం ఏంటంటే సుజీత్ తెర‌కెక్కించిన `సాహో` డిజాస్ట‌ర్ అనిపించుకున్నా కానీ అత‌ని మేకింగ్ స్టైల్ మాత్రం అంద‌రిని ఆక‌ట్టుకుంది. హాలీవుడ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో `సాహో`ని తెర‌కెక్కించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది. ఇది న‌చ్చ‌డం, సుజీత్ టాలెంట్ ఏంటో ఈ మూవీ మేకింగ్ తో స్ప‌ష్టం కావ‌డం వ‌ల్లే ప‌వ‌న్ ఫ్యాన్స్ సుజీత్ ని ట్రోల్ చేయ‌డం లేద‌ని తెలుస్తోంది.

అంతే కాకుండా ఆదివారం విడుద‌ల చేసిన అనౌన్స్ మెంట్ పోస్ట‌ర్ రెగ్యుల‌ర్ పోస్ట‌ర్ లా కాకుండా ప‌వ‌ర్ ఫుల్ మూవంఈతో రాబోతున్నాయ‌ని చెప్పిన తీరు, ప‌వ‌న్ ని స‌రికొత్త‌గా సుజీత్ ఈ మూవీలో ప్ర‌జెంట్ చేయ‌బోతున్నాడ‌ని ఫ్యాన్స్ బ‌లంగా న‌మ్మేలా చేసింది. ఆ కార‌ణంగానే సుజీత్ కు ప‌వ‌న్ ఫ్యాన్స్ అండ‌గా నిల‌బ‌డి పాజిటివ్ గా స్పందించార‌ని ఇన్ సైడ్ టాక్‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.