నైట్ పార్టీలో తమన్ మిస్సింగ్.. ఏమైందీ?

Sat May 14 2022 14:01:58 GMT+0530 (IST)

thaman missing in night party

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం `సర్కారు వారి పాట` ఈ గురువారం విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తొలి రోజు తొలి షో నుంచే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.  టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ఫ్యాన్స్ కూడా మిశ్రమ స్పందనని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా మహేష్ సినిమా కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదని కొంత వరకు వారిని నిరుత్సాహానికి గురిచేసిందని తెలుస్తోంది.  గురు శుక్ర శని ఆదివారాలు వీకెండ్స్ కావడంతో కలెక్షన్స్ కొంత వరకు ఫరవాలేదనిపంచే స్థాయిలో వుండొచ్చని అసలు టాక్ సోమవారం కానీ తెలియదని వసూళ్ల పరంగా కూడా మండే సినిమాపై మరింత ప్రభావాన్ని చూపుతుందని తెలుస్తోంది.సినిమాకు మిశ్రమ స్పందన లభించినా తొలి రోజు వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 75 కోట్లు వసూలు చేసిందని  రిజనల్ మూవీస్ లో ఇదే రికార్డుగా మేకర్స్ ప్రచారం చేస్తున్నారు. అయితే మండే రోజు ఈ సినిమా పూర్తి ఫిలితం బయటపడబోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఫలితం విషయంలో పెద్దగా సంతృప్తిని వ్యక్తం చేయడం లేదు.  

ఇదిలా వుంటే చిత్ర బృందం సక్సెస్ సంబరాలని మొదలు పెట్టేసింది. ప్రత్యేకంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని పోష్ పబ్ లో టీమ్ మెంబర్స్ తో పాటు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో మైత్రీ టీమ్ తో పాటు హీరో మహేష్ బాబు నమ్రత  డైరెక్టర్ పరశురామ్ డైరెక్టర్లు హరీష్ శంకర్ సుకుమార్ బుచ్చిబాబు సానా మెహెర్ రమేష్ శిరీష్ దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. కానీ తమన్ హీరోయిన్ కీర్తి సురేష్ ఎక్కడా కనిపించలేదు. మరీ ముఖ్యంగా తమన్ ఈ పార్టీలో కనిపించకపోవడంతో ప్రతీ ఒక్కరూ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక మహేష్ డైరెక్టర్లలో సుకుమార్ కు ఆహ్వానం అందింది ఆయన వచ్చారు. త్రివిక్రమ్ కు నో ఇన్విటేషన్ కాబట్టి ఆయన రాలేదు. ఇక మెహెర్ రమేష్ ఈ పార్టీలో ఎందుకున్నారంటే మహేష్ కు అతనికి మధ్య `బాబీ` సినిమా నుంచి మంచి రిలేషన్ వుంది. ఆ కారణంగా తను అటెండ్ అయ్యాడు. సినిమాకు సంబంధించిన తమన్ మాత్రం ఈ పార్టీలో మిస్ కావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. `సర్కారు వారి పాట`కు తమన్ ఛీఫ్ టెక్నీషియన్. మరి అలాంటి వ్యక్తి నైట్ పార్టీలో ఎందుకు లేడు? అన్నది ఇప్పడు ప్రతీ ఒక్కరిలో అనుమానాల్ని రేకెత్తిస్తోంది.  

తమన్ హైదరాబాద్ లోనే వుంటున్నారు. అయితే కొంత మంది మాత్రం శుక్రవారం తమన్ హైదరాబాద్ లో లేడని తను చెన్నై వెళ్లిపోయాడని ఆ కారణంగానే తను నైట్ పార్టీలో పాల్గొనలేకపోయాడని చెబుతున్నారు. కానీ మరి కొందరు మాత్రం తమన్ నేపథ్య సంగీతాన్ని అనుకున్న స్థాయిలో అందివ్వలేదని ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా తమన్ పై గుర్రుగా వున్నారని అందుకే తమన్ పార్టీలో పాల్గొనలేదని చెబుతున్నారు.