సినీ ఇండస్ట్రీలు కోవిద్ ప్రొటెక్షన్ సిస్టం.. ఆలోచనలో ఉందా..?

Mon Jul 13 2020 15:40:11 GMT+0530 (IST)

tfi planning to covid protection unit

దేశ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో కరోనా భయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకూ అందరూ ఇంటిపట్టునే ఉంటూ జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇటీవలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులు అమలు చేయడంతో జనాలకు సెలబ్రిటీలకు విచ్చలవిడిగా బయట తిరిగే అవకాశం లభించిందని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ కూడా అదే రేంజ్ లో విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో లక్షల్లో కరోనా కేసులు నమోదు కావడంతో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ సినిమా షూటింగుల కోసం ఇంతకాలం పోరాడిన ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు షూటింగులకు రావడానికి జంకుతున్నారు. టాలీవుడ్ బాలీవుడ్ లతో అన్నీ ఇండస్ట్రీలు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన షూటింగ్స్ కి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నుండి తప్పించుకునే ఎలా తెప్పించుకోవాలా అని ఆలోచన చేస్తున్నారు.అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడడానికి కోవిద్ ప్రొటెక్షన్ సిస్టం అనే ఒక సినీ విభాగాన్ని నెలకొల్పాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే స్టార్ సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్న క్రమంలో ఈ విభాగం ఏం చేస్తుందని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఈ విభాగం అసలు ఏం చేస్తుందంటే.. సినిమా షూటింగ్ ప్రారంభం చేసినప్పుడు ఇండోర్ అవుట్ డోర్  ఎక్కడైనా ఈ కోవిద్ విభాగం ఆ చిత్రబృందం తోనే ఉంటుందట. వారిని రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోనుందట. అంతేగాక షూటింగ్ ఏరియాలో ఎలాంటి కోవిద్ వైరస్ ప్రభావం కనిపించకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన కోవిద్ నిబంధనలతో ఈ కోవిద్ విభాగం ప్రొటెక్షన్ కల్పించనుందట. త్వరలోనే ఈ సిస్టం ప్రారంభం చేసే ఆలోచనలో పడ్డాయట సినీఇండస్ట్రీలు. చూడాలి మరి త్వరలో ఈ ప్రొటెక్షన్ సిస్టంతో షూటింగ్స్ మొదలు పెడతారేమో..!