Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ పై '21డేస్' భారీ సినిమా..

By:  Tupaki Desk   |   16 April 2020 9:30 AM GMT
కరోనా వైరస్ పై 21డేస్ భారీ సినిమా..
X
కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తుంది. ఈ వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్నీ దేశాలు నిరంతరం పోరాడుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తమ తమ దేశాల్లో ఎన్నో నిబంధనలు విధించారు. మనదేశంలో ఇప్పటికే 21 రోజుల లాక్‌డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం.. దాన్ని మే 3 వరకూ పొడిగించింది. ఈ లాక్‌డౌన్ ఇతివృత్తంగా సినిమా తీయాలని కోలీవుడ్ నిర్మాత ఎం. విజయ భాస్కర్ రాజ్ నిర్ణయించుకున్నారు. '21 డేస్‌' పేరుతో స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. దర్శకుడిగా విజయ్ భాస్కర్ కి ఇదే తొలి చిత్రం కాగా కథ, కథనం, మాటలు కూడా ఆయనే అందిస్తున్నారట.

ఈ భయంకరమైన వైరస్‌ గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేలా చిత్రాన్ని రూపొందిస్తామని విజయ్ చెప్పారు. వైరస్ ప్రమాదాన్ని తెలిపే సూక్ష్మ సినిమా కాదని, స్నేహం, ప్రేమ తదితర అంశాలు కూడా ఉంటాయని తెలిపారు. మూడు గంటల్లోనే కథ తట్టిందని, వారం రోజుల్లో స్క్రీప్ట్ తయారు చేశానని విజయ్ భాస్కర్ తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. అన్నీ కరెక్ట్ గా జరిగితే తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.

దేశంలో కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి అది తప్పా వేరే వార్త లేకుండా పోయింది. మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు, అధికారులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా పై అవగాహన కల్పిస్తూ పాటలు, షూట్లు చేస్తున్నారు. గతంలో తమిళ ప్రముఖ నటుడు సూర్య నటించిన సెవెన్త్ సెన్స్ అనే సినిమాలో కూడా భయంకరమైన వైరస్ గురించి ప్రస్తావన ఉంటుంది. ఆ సినిమాలో కూడా వైరస్‌ చైనాలోనే పుడుతుంది. మరి ఈ కరోనా కూడా అక్కడే పుట్టింది. కానీ విజయ్ భాస్కర్ ఎలా చూపించనున్నాడు అని సందేహాలు తలెత్తుతున్నాయి.