Begin typing your search above and press return to search.

జమున బయోపిక్ లో మిల్కీ బ్యూటీ

By:  Tupaki Desk   |   29 Jan 2023 9:00 AM GMT
జమున బయోపిక్ లో మిల్కీ బ్యూటీ
X
వెటరన్ స్టార్ హీరోయిన్ జమున హైదరాబాద్ లో ఆమె నివాసంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్ లో దశాబ్దకాలం పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగిన ఆమె తరువాత కాలంలో ఎన్టీఆర్, ఎఎన్నార్ లతో గొడవల కారణంగా తెలుగులో సినిమాలు తగ్గించింది. ఆ సమయంలో తమిళంలో భాగా సక్సెస్ అయ్యింది. ఇక సౌత్ లో అన్ని బాషలలో జమున సినిమాలు చేసింది. ఇదిలా ఉంటే ఈమె 86 ఏళ్ళ వయస్సులో తాజాగా అనారోగ్య సమస్యలతో మృతి చెందింది.

ఇక జమున అంత్యక్రియలని ఆమె కుమార్తె నిర్వహించడం విశేషం. ఈమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులుఅ అందరూ కూడా సోషల్ మీడియాలో ద్వారా తమ సంతాపం తెలియజేశారు. ఆమెని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ కూడా జమునని గుర్తుచేసుకోవడం విశేషం. వీరిలో తమన్నా, సమంత ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు జమున బయోపిక్ త్వరలో తమిళంలో తెరకెక్కబోతుంది అనే వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఈ బయోపిక్ కోసం ఎప్పటి నుంచో కసరత్తు చేస్తున్నారని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. ఇప్పటికే దీనికి సంబందించిన స్క్రిప్ట్ వరక కూడా అయిపోయిందని టాక్. ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం తమన్నా భాటియాని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఆమె కూడా జమున పాత్రలో కనిపించడానికి చాలా ఆసక్తిగా ఉందనే మాట వినిపిస్తుంది.

ఈ బయోపిక్ లో ఆమె సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలో స్టార్ హీరోలతో గొడవలు, ఆత్మాభిమానం ఉన్న ఒక మహిళగా ఆమె క్యారెక్టర్ కి మంచి గుర్తింపు ఉంది. ఈ నేపధ్యంలో ఆమె జీవితాన్ని తెరపైకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి. ప్రస్తుతం తమన్నా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో రజినీకాంత్ కి జోడీగా నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా చేస్తుంది. వీటి తర్వాత జమున బయోపిక్ ఉండే అవకాశం ఉన్నట్లు టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.