`స్వాతిముత్యం` సక్సెస్ తో గణేష్ కి 10 మార్కులు!

Fri Oct 07 2022 19:08:05 GMT+0530 (India Standard Time)

swathi muthyam movie Bellamkonda Ganesh

నిర్మాత బెల్లంకొడ సురేష్ తనయుడు గణేష్ హీరోగా పరిచయమైన `స్వాతిముత్యం` ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకి మంచి రివ్యూలతో పాటు ప్రేక్షకులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు టాలీవుడ్ లో జెండా పాతేయడం ఖాయమంటూ ప్రశంసలొస్తున్నాయి. తొలి సినిమాతోనే గణేష్ తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు.తాజాగా ఈ  సినిమా విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. ఇందులో నటీనటులు మరియు సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఈ  సందర్భంగా చిత్ర నిర్మాత నాగ వంశీ స్వాతిముత్యం విజయం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. `అన్ని ఏజ్ గ్రూప్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

అలాగే  టీమ్‌కు విజయాన్ని అందించాలని ఆకాంక్షించిన చిరంజీవికి నిర్మాత మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. `గాడ్ ఫాదర్`  సినిమా పెద్ద విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సినిమాలు ఒకేసారి విజయవంతం కావడంతో కొత్త ఉత్సాహాన్నిస్తుందన్నారు.

అలాగే హీరో  గణేష్ మాట్లాడుతూ..`ముందుగా నేను తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ . ఎందుకంటే హీరోగా నన్ను అంగీకరించారు .  సినిమాకి సక్సెస్ ఇచ్చారు. ఈ సినిమాలో తెరపై గణేశ్ కనిపించలేదు .. బాలా అనే  పాత్ర మాత్రమే కనిపించిందని అంటున్నారు. అందుకు  చాలా సంతోషంగా ఉంది. హీరోగా తొలి సినిమాతో ఒక 10 మార్కులు వేయించుకున్నానని అనుకుంటున్నాను` అన్నారు. `ఈ సినిమాలో చేసే ఛాన్స్ రావడం నా అదృష్టం. సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించే ఒక అవకాశం నాకు ఈ సినిమా వలన కలిగింది` అని వర్ష బొల్లమ్మ హర్షం వ్యక్తం చేసింది. అలాగే మిగతా సభ్యులు స్వాతిముత్యం సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేసారు.

ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.  ఇందులో ప్రగతి సురేష్.. వెన్నెల కిషోర్.. సుబ్బరాజు  తదిరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ కె.కృష్ణ  దర్శకత్వం వహించారు. నాగ వంశీ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి   చిత్రాన్ని నిర్మించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.