Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ కు తెగ నచ్చేసిన యంగ్‌ హీరో

By:  Tupaki Desk   |   14 Oct 2021 8:30 AM GMT
సూపర్ స్టార్ కు తెగ నచ్చేసిన యంగ్‌ హీరో
X
యంగ్ హీరో కార్తికేయ విలక్షణ పాత్రలు ఎంపిక చేసుకుంటూ కెరీర్ లో దూసుకు వెళ్తున్నాడు. హీరోలు సాదారణంగా విలన్ పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపించరు. కాని కార్తికేయ మాత్రం నటుడిగా తనను తాను నిరూపించుకునేందుకు గాను విలన్ పాత్రలను కూడా చేస్తూ కెరీర్‌ ను అద్బుతంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత కూడా వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అదే సమయంలో నాని గ్యాంగ్‌ లీడర్ సినిమాలో విలన్ గా నటించాడు. చక్కని పాత్రతో విలన్ గా కార్తికేయ మెప్పించాడు. ఆ సినిమాలో పాత్రవల్లో లేదా మరేంటో కాని సూపర్ స్టార్‌ అజిత్‌ సినిమాలో విలన్ గా నటించే అవకాశంను దక్కించుకున్నాడు.

తమిళ సూపర్ స్టార్‌ అజిత్‌ హీరోగా రూపొందిన వాలిమై సినిమాలో కార్తికేయకు అవకాశం దక్కింది. మొదట ఈ సినిమాలో కార్తికేయ నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చిన సమయంలో ఏదో చిన్న పాత్రలో లేదా చిన్న విలన్‌ పాత్రను చేస్తూ ఉంటాడు అని కొందరు అనుకున్నారు. కాని తమిళ మీడియా వర్గాలు మరియు చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అజిత్ పాత్రకు ఏమాత్రం తక్కువ కాకుండా కార్తికేయ పాత్ర ఉంటుందట. సినిమాలో అజిత్ కు కార్తికేయకు స్నేహం ఉంటుందట. ఆ స్నేహం కాస్త కొన్ని కారణాల వల్ల శత్రుత్వంగా మారుతుంది.

ఆప్త మిత్రులు బద్ద శత్రువులు అయితే ఎలా ఉంటుంది... వారిద్దరి మద్య ఫైట్ ఎంత ఎమోషనల్‌ గా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట. అద్బుతమైన యాక్షన్ సన్నివేశాల్లో అజిత్ తో సమానంగా కార్తికేయ నటించాడని తెలుస్తోంది. సూపర్‌ స్టార్‌ అజిత్ తో కార్తికేయకు నటించే అవకాశం రావడం అద్బుతం.. అలాంటిది ఏకంగా సమానమైన పాత్ర రావడం అంటే మామూలు విషయం కాదు. అంతే కాకుండా అజిత్‌ కు కార్తికేయ నటన మరియు పద్దతి బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా తెగ నచ్చాయట.

పలు సందర్బాల్లో కార్తికేయను అజిత్ పొగడ్తల్లో ముంచెత్తాడట. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా కార్తికేయ అక్కడ ఇక్కడ మరింత పాపులర్ అయ్యి మరో మెట్టు ఎక్కి స్టార్ డమ్ దక్కించుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాలిమై సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14వ తారీకున విడుదలకు సిద్దం అవుతోంది. మరో వైపు కార్తికేయ హీరోగా రెండు మూడు సినిమాలు తెలుగు లో రూపొందుతున్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్ రావాల్సి ఉంది.