Begin typing your search above and press return to search.

సందీప్ కిష‌న్ ఈ సారి స‌ర్ ప్రైజింగ్ షాకిస్తాడ‌ట‌!

By:  Tupaki Desk   |   2 Feb 2023 9:06 PM GMT
సందీప్ కిష‌న్ ఈ సారి స‌ర్ ప్రైజింగ్ షాకిస్తాడ‌ట‌!
X
సందీప్ కిష‌న్.. ఈ యంగ్ హీరో త‌న న‌ట ప్ర‌స్థానాన్ని ప్రారంభించి స‌రిగ్గా ప‌ద‌మూడేళ్లు కావ‌స్తోంది. `ప్ర‌స్థానం` సినిమాతో న‌టుడిగా కెరీర్ మొద‌లు పెట్టిన సందీప్ కిష‌న్ మూడేళ్ల త‌రువాతే `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్` తో స‌క్సెస్ ని సొంతం చేసుకున్నాడు. `టైగ‌ర్‌`తో ఫ‌ర‌వాతేద‌నిపించుకున్నా త‌న స్థాయి స‌క్సెస్ ని సందీప్ కిష‌న్ ద‌క్కించుకుని చాలా కాల‌మే అవుతోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నా సందీప్ కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు.

తను న‌టించే ప్ర‌తీ సినిమాకు క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నా కానీ అదృష్టం మాత్రం క‌లిసి రావ‌డం లేదు. ఏ1 ఎక్స్ ప్రెస్‌, గ‌ల్లీ రౌడీ చిత్రాల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఆశించిన ఫ‌లితాల్ని సందీప్ కిష‌న్ ఈ సినిమాతో రాబ‌ట్ట‌లేక‌పోయాడు. ప్ర‌స్తుతం తెలుగు సినిమా మార్కెట్ ప‌రిధి పెరిగి భారీ క్రే.్ ఏర్ప‌డిన నేప‌థ్యంలో ఈ సారి పాన్ ఇండియా మూవీతో బాక్సాఫీస్ పై దండెత్తాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. త‌న కెరీర్ కిది భార‌మే అయినా రిస్క్ చేయ‌క తప్ప‌ద‌ని భావించి ధైర్యంగా ముంద‌డుగేశాడు.

సందీప్ కిష‌న్ న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ డ్రామా `మైఖేల్‌`. భ‌ర‌త్ చౌద‌రి, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా రంజిత్ జ‌య‌కోడి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ మూవీకి క‌ర్త క‌ర్మ క్రియ సందీప్ కిష‌న్‌. త‌న వ‌ల్లే ఈ ప్రాజెక్ట్ లో విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ మీన‌న్‌,అన‌సూయ‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఎంట‌ర‌య్యారు.. కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెకొన్న ఈ మూవీని ఈ శుక్ర‌వారం భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమా విష‌యంలో సందీప కిష‌న్ గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నాడు. త‌న‌కొచ్చిన ఐడియాని ప‌ట్టుకుని, ద‌ర్శ‌కుడిని, మేక‌ర్స్ ని వెతుక్కుని దీనికి కావాల్సిన న‌టీన‌టుల‌ని సెట్ చేసి మ‌రీ ఈ మూవీని రెడీ చేయించుకున్నాడు. అందేకే ఈ మూవీపై త‌ను గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నాడు. పేప‌ర్ పై రాసుకున్న సినిమా క‌థ తెర‌పైకి వ‌స్తే బాగుంటుంది కానీ ఈ సినిమా విష‌యంలో మాత్రం రాసుకున్న క‌థ ప‌ది రెట్లు బాగా వ‌చ్చింద‌ని, ఈ క‌థ‌ని ఇంత‌కు మించి ఎవ‌రూ తీయ‌లేర‌ని స్ప‌ష్టం చేశాడు సందీప్ కిష‌న్‌.

ఈ మూవీతో స‌రికొత్త ఇమేజ్ ని కోరుకుంటున్న సందీప్ కిష‌న్ దీని త‌రువాత క్రేజీ లైన‌ప్ ని కూడా రెడీ చేసుకుంటున్నాడ‌ట‌. ధ‌నుష్ తో క‌లిసి `కెప్టెన్ మిల్ల‌ర్‌`లో న‌టిస్తున్నాన‌ని తెలిపిన సందీప్ కిష‌న్ ఊహించ‌ని క‌ల‌యిక‌లో ఓ స‌ర్ ప్రైజింగ్ మూవీని చేమ‌య‌బోతున్నాన‌ని, మా కాంబినేష‌న్ చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోతార‌ని, క‌ల‌లో కూడా తాను అలాంటి ద‌ర్శ‌కుడితో క‌లిసి వ‌ర్క్ చేస్తాన‌ని అనుకోలేద‌ని స్ప‌ష్టం చేస్తున్నాడు. ఇంత‌కీ సందీప్ కిష‌న్ తో సినిమా చేయ‌బోతున్న ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ఇంత‌కీ ఆ ప్రాజెక్ట్ ఎలా వుంటుద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.