Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్ మైకేల్.. బాక్సాఫీస్ లెక్క ఎంత?

By:  Tupaki Desk   |   6 Feb 2023 9:05 PM GMT
సందీప్ కిషన్ మైకేల్.. బాక్సాఫీస్ లెక్క ఎంత?
X
సందీప్ కిషన్ రీసెంట్ గా ఫ్యాన్ ఇండియా మూవీ మైఖెల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎలాగైనా ఈ చిత్రంతో హిట్ కొట్టాలని ప్రయత్నించాడు. అయితే ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గానే నిలిచింది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ని అందుకున్నా కానీ తర్వాత స్లో అవుతూ వచ్చింది. రెండో రోజు పర్వాలేదు అనిపించినా మూడో రోజు మాత్రం స్లో అయిపొయింది.

తమిళ్ లో మాత్రం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన ఈ సినిమా.. ఓవర్సీస్ లోనూ క లెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయిపొయింది. సినిమా 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే… ముందుగా తమిళ్ కలెక్షన్స్ విషయానికి వస్తే… తొలి రోజు రూ.70 లక్షలు, రెండో రోజు రూ. 75 లక్షలు మూడోరోజు రూ. 40 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా రూ 1.90కోట్ల గ్రాస్, 0.80 షేర్ కలెక్ట్ చేసింది. ఏపీ తెలంగాణలో తొలిరోజు 2.05 కోట్లు రెండో రోజు 1.35 కోట్లు,, మూడోరోజు 60 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా 4కోట్ల గ్రాస్ 2.10 కోట్ల షేర్ వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 3.35 కోట్లు రెండో రోజు 2.40 కోట్లు, మూడో రోజు 1.20 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 6 95 కోట్ల గ్రాస్, 3.45 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇకపోతే సినిమా బాక్స్ ఆఫీస్ వాల్యూ బిజినెస్ రేంజ్ 6.50 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 7 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాల్సి ఉంటుంది.

కాగా, ఇక ఈ చిత్రంలో మైఖేల్‌ పాత్ర కోసం సందీప్‌ తన లుక్‌ను మార్చుకున్న తీరు మెచ్చుకుని తీరాల్సిందే. అయితే అతను ఆ పాత్రలో లీనమైనా తన నటన ఎందుకో కొంచెం కృత్రిమంగానే అనిపిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టాడు. అయితే దర్శకుడు రంజిత్‌ తీర్చిదిద్దుకున్న కథలో కొత్తదనం లేదు. మేకింగ్‌ స్టైల్‌, కథనాన్ని నడిపించిన తీరు కొంత వరకు మెప్పించింది.. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ సామ్‌ సీఎస్‌ నేపథ్య సంగీతమే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.