బిగ్ బాస్ వైల్డ్ కార్డ్.. మరో జబర్దస్త్ కమెడియన్?

Fri Oct 07 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

sudheer wildcard entry bigg boss

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ నాగార్జున హోస్టింగ్ తో విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఆరవ సీజన్ కూడా అదే తరహాలో కొనసాగిస్తుంది. ఈసారి కంటెస్టెంట్స్ కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ట్విస్టులు కూడా ఊహించిన విధంగా ఉంటున్నాయి. గత రెండు వారాల కంటే ఇప్పుడు ఐదవ వరం మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది.ఇక ఎలిమినేషన్స్ కూడా ఊహించిన విధంగా జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులతో వారి టాలెంట్ ను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ కు గతవారం కంటే ఈసారి ఓట్ల సంఖ్య కూడా ఎక్కువగానే పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్ అయితే ప్రస్తుతం అందరికంటే ఎక్కువ ఓట్లు అందుకున్నట్లు సమాచారం.

అయితే త్వరలోనే అతనికి పోటీ ఇచ్చే విధంగా ఒక బలమైన కంటెస్టెంట్ ను రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు మరొక టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు బిగ్ బాస్ లో రేవంత్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నట్లు సోషల్ మీడియాలో కూడా టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. ఇక ఇప్పుడు మరొక జబర్దస్త్ కమెడియన్ ను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం చలాకీ చంటి కామెడీ టైం తో బాగానే ఆకట్టుకుంటున్నాడు.

ఇక అతనికి కూడా పోటీగా మరొక జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అతను ఒక రోజుకు దాదాపు లక్షకు పైగానే పారితోషికం అందుకుంటూ రియాలిటీ షోలు చేస్తున్నాడు.

మరి ఇప్పుడు బిగ్ బాస్ లో పాల్గొనాలి అంటే అంతకంటే ఎక్కువ స్థాయిలోనే అతనికి ఆదాయం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే గతంలోనే బిగ్ బాస్ లో అతను రాబోతున్నట్లు చాలా కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు కూడా ఒక టాక్ వైరల్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.