Begin typing your search above and press return to search.

సుశాంత్ ను స్టన్ గన్ తో చంపేసి ఉంటారు: సుబ్రహ్మణ్యస్వామి

By:  Tupaki Desk   |   13 Aug 2020 1:30 AM GMT
సుశాంత్ ను స్టన్ గన్ తో చంపేసి ఉంటారు: సుబ్రహ్మణ్యస్వామి
X
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతిపై ఇంతవరకు ముంబై పోలీసులు ఎటూ తేల్చడం లేదు. ఈ క్రమంలోనే ఇది రాజకీయ రంగు పులుముకుంది. సుశాంత్ ది హత్యేనని మహారాష్ట్రలోని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. బీహార్ రాష్ట్ర వాసులు కూడా ఇదే ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే సుశాంత్ మృతిపై మొదటి నుంచి ఫైట్ చేస్తున్న బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని మోడీకి లేఖ రాసిన ఆయన తాజాగా ఈ ఆరోపణలు చేయడం సంచలనమైంది.

సుశాంత్ సింగ్ ను షాక్ ఇవ్వడానికి ఉపయోగించే స్టన్ గన్ తో హత్య చేసి ఉంటారని సుబ్రహ్మణ స్వామి ఆరోపించారు. ఈ కేసును సీబీఐతోపాటు ఎన్ఐఏతో కూడా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

సుశాంత్ మెడపై ఎడమవైపు ఉన్న ముద్రలు స్టన్ గన్ తో పడినవే అని సుబ్రహ్మణ్యస్వామి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.