భయం గుప్పిట్లో స్టార్ ప్రొడ్యూసర్!

Fri Aug 12 2022 07:00:01 GMT+0530 (IST)

star producers movie news

ఒక సినిమా సెట్ పైకి వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకుని సేఫ్ గా డిస్ట్రిబ్యూటర్ల నుంచి థియేటర్లకు రావాలంటే చాలా తతంగం వుంటుంది. సినిమాని సేఫ్ గా డిస్ట్రిబ్యూటర్ నుంచి థియేటర్లలోకి రిలీజ్ చేసే వరకు ప్రొడ్యూసర్ పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. అనుకున్నది కాస్తా అటు ఇటైతే ఫైనాన్షియర్లు మీదపడతారు. వడ్డీలు కట్టలేక అసలు క్లియర్ చేయలేక ప్రొడ్యూసర్స్ పరిస్థితి దారుణ స్థితికి చేరుకోవడం తెలిసిందే. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన `ఆచార్య` మూవీ ఇందుకు పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు.భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య విడుదలై అత్యంత డిజాస్టర్ గా నిలిచి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకు సామాన్య ప్రేక్షకులకు కూడా షాకిచ్చింది. ఈ మూవీ ద్వారా వచ్చిన నష్టాలని రికవరీ చేయాల్సిందే అంటూ డిస్ట్రిబ్యూటర్లు కొంత మంది మేకర్స్ కి డైరెక్టర్ కి హీరోకి ఓపెన్ లెటర్లు రాయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

ఇదిలా వుంటే ఓ క్రేజీ హీరోతో అతని మార్కెట్ కి మించి కోట్ల బడ్జెట్ తో ఓ స్టార్ ప్రొడ్యూసర్ సినిమా చేస్తున్నారు. యాక్షన్ స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్నఈ మూవీ షూటింగ్ దశలో వుంది.

రిలీజ్ డేట్ ని కూడా ఈ మధ్యే ప్రకటించారు కూడా. యాభై శాతం చిత్రీకరణకే కోట్లు ఖర్చు చేశారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మూవీకి ఇప్పటికే రూ. 40 కోట్ల మేర ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి తోడు మిగతా భాగం పూర్తి చేయాలంటే మరిన్ని కోట్లు ఖర్చు చేయాల్సిందేనట.

అంటే మిగతా భాగం పూర్తి చేయడానికి సదరు నిర్మాత అక్షరాలా మరో 30 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అంటే 20 కోట్ల బడ్జెట్ ఎక్కువ అనుకున్న హీరోపై ఏకంగా 70 కోట్ల మేర బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారన్నమాట. గత రెండు నెలల్లో వరుసగా తెలుగు సినిమా ఏదీ సక్సెస్ కాకపోవడం.. సరైన స్థాయిలో పెట్టిన పెట్టుబడిని రాబట్టలేకపోవడంతో సదరు నిర్మాత 70 కోట్ల బడ్జెట్ రికవరీపై భయం భయంగా అడుగులు వేస్తున్నాడట.

ఆ కారణంగానే దర్శకుడితో పెద్దగా మాట్లాడటం లేదని దర్శకుడు ఏం చేప్పినా మండిపడుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దర్శకుడు కూడా నిర్మాతని పట్టిచుకోకుండా సినిమాని లాగించేస్తున్నాడని చెబుతున్నారు. రీసెంట్ గా సదరు స్టార్ డైరెక్టర్ కు స్టార్ హీరో ఆఫర్ ఇవ్వడంతో మరింతగా మాట వినడం లేదని తనకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళుతున్నారని ఇన్ సైడ్ టాక్.