Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ ఇంటికి సీల్

By:  Tupaki Desk   |   12 July 2020 8:50 AM GMT
స్టార్ హీరోయిన్ ఇంటికి సీల్
X
బాలీవుడ్ ప్రముఖులను కరోనా వణికిస్తోంది. ముంబయి లో కేసులు అత్యధికంగా పెరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ వారు కూడా ఒక్కరు ఒక్కరు చొప్పున వైరస్ బారిన పడుతున్నారు. ఇటీవలే బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా బాటివుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రేఖ ఇంట్లో కూడా కరోనా కేసు నమోదు అయింది.

రేఖ వ్యక్తిగత సెక్యూరిటీ గార్డ్ కు కరోనా పాజిటివ్ అంటూ వెల్లడి అవ్వడంతో ముంబయి మున్సిపల్ అధికారులు ఆమె ఇంటిని సీల్ చేశారు. అందులో నుండి ఎవరు రాకూడదని.. ఆ ఇంట్లోకి ఎవరు వెళ్లకూడదు అని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే కరోనా కేసులో పెరుగుతున్న నేపథ్యంలో రేఖ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆమె అభిమానుల్లో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించిన ఆందోళన కనిపిస్తోంది.