Begin typing your search above and press return to search.

నాని కోసం రంగంలోకి స్టార్ హీరోస్

By:  Tupaki Desk   |   29 Jan 2023 9:00 AM GMT
నాని కోసం రంగంలోకి స్టార్ హీరోస్
X
గతేడాది నాని శ్యాం సింగరాయ్, అంటే సుందరానికీ అనే సినిమాలతో వచ్చాడు. అయితే అంటే సుందరానికీ! సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడలేదు. ఇక ఈ ఏడాది దసరా మూవీతో నాని ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నాని ఈ చిత్రంలో రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.

సింగరేణి నేపథ్యంలో భారీగా వస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాపై అప్పట్లో ట్రోల్స్ కూడా వచ్చాయి. నాని లుక్ చూసి అందరూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ ను పోలిఉందని కామెంట్స్ చేశారు. ఇక పుష్ప లాగా ఇది రెండు పార్ట్స్ ఉంటుందని ఓ వార్త వైరల్ కాగా... ఒకటే పార్ట్ అంటూ నాని స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో రెండు పార్ట్‌లు అన్న రూమర్‌కు తెరపడింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా జనవరి 30న ఈ సినిమా టీజర్‌ రిలీజ్ చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది.

ఇక తాజా విషయం ఏమిటంటే... ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండంతో... సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇక జనవరి 30న నాని దసరా ట్రైలర్ ను అన్ని భాషల్లో స్టార్ హీరోలు రిలీజ్ చేయనున్నారు. తమిళ టీజర్ ను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రిలీజ్ చేయనుండగా.. మలయాళం టీజర్ ను దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేయనున్నాడు. ఇక కన్నడ టీజర్ ను రక్షిత్ షెట్టి రిలీజ్ చేయనుండగా... హిందీ టీజర్ ను షాహిద్ కపూర్ రిలీజ్ చేయనున్నాడు.

నాని ఈ సినిమాలో ఓ పల్లెటూరి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సుధాకర్‌ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న దసరాలో నాని, కీర్తి సురేష్‌తో పాటు మరో కీలకపాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.