రాజమౌళి ఫోకస్ ఇప్పటికైనా మారిందా?

Sun Jan 16 2022 11:27:24 GMT+0530 (IST)

ss rajamouli New Plan

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా ను మొదలు పెట్టి దాదాపు నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఆరంభంలో షూటింగ్ ఆలస్యం అయ్యింది.. ఆ తర్వాత కరోనా వల్ల షూటింగ్ సరిగా సాగలేదు. ఏదోలా సినిమా షూటింగ్ ను ముగించారు.. ఇక విడుదల చేద్దాం అని సంక్రాంతి రిలీజ్ కు డేట్ ను ప్రకటించి ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు. అంతలో కరోనా థర్డ్ వేవ్ కారణంగా మొత్తం తలకిందులు అయ్యింది. సినిమా మరో వారం రోజుల్లో విడుదల అనగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించాల్సి వచ్చింది. రాజమౌళి ఒక సినిమా చేస్తున్న సమయంలో మరో సినిమాపై ఫోకస్ పెట్టడు. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు.ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి చేయాల్సిన సినిమా మహేష్ బాబు తో అనే విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన విషయాన్ని ఎప్పుడు అడిగినా కూడా ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ఆర్ ఆర్ ఆర్ పైనే ఉంది అనేవాడు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా ముగిసింది.. విడుదలకు సిద్దంగా ఉంది. కనుక ఇప్పటికి అయినా రాజమౌళి ఫోకస్ మారిందా... మహేష్ బాబు సినిమా వైపుకు వెళ్లిందా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తుంది. మహేష్ బాబు సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్ కొన్ని కథలను మరియు లైన్స్ ను సిద్దం చేసి ఉంచారట. ఆయన రెడీ చేసిన కథల పై రాజమౌళి చర్చించడం మొదలు పెట్టినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబో మూవీ ఏ కాన్సెప్ట్.. స్టోరీ లైన్ ఏంటీ అనే విషయం పై ఈ ఏడాది చివరి వరకు అయినా క్లారిటీ వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఖచ్చితంగా ఈ వార్త ఆనందంను కలిగించేది అనడంలో సందేహం లేదు. రాజమౌళి దర్శకత్వంలో సినిమాకు ముందు మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట మరియు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాలను ముగించాల్సి ఉంది. ఈ రెండు సినిమాల ను ముగించిన తర్వాత అంటే వచ్చే ఏడాది ఆరంభంలో లేదా ఈ ఏడాది ప్రారంభంలోనే సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు.

రాజమౌళి చేసే సినిమాలు అద్బుతాలు అంటూ పొగడ్తలు కురిపించే వారే ఆయన సినిమాలకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. గడచిన పదేళ్లలో ఆయన చేసినవి బాహుబలి మరియు ఆర్ ఆర్ ఆర్ మాత్రమే. అలాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఇంత స్లోగా సినిమాలు తీస్తే ఎలా అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజమౌళి స్పీడ్ గా సినిమా లు చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే కనుక నిజం అయితే మహేష్ బాబుతో సినిమా కేవలం ఏడాదిన్నర లో పూర్తి చేసే అవకాశం ఉందంటున్నారు.