మెగా కాంపౌండ్ లో 'పెళ్లిసందD'

Sat Oct 23 2021 17:00:01 GMT+0530 (IST)

sreeleela Upcoming Movies

పెళ్లిసందD సినిమాతో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ పరిచయం అయ్యాడు. సినిమా నిరాశ పర్చడంతో రోషన్ కెరీర్ పై పలువురు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోషన్ హీరోగా నిలదొక్కుకోవాలంటే మరో సినిమా కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. కాని పెళ్లిసందD సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల మాత్రం మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. సినిమా ప్లాప్ అయినా కూడా హీరోయిన్స్ కు ఆఫర్లు రావడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. ఆ రేర్ సంఘటన పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీల విషయంలో జరిగింది. రాఘవేంద్ర రావు మెచ్చిన హీరోయిన్ అవ్వడంతో పాటు ఆమెను చూసిన ప్రతి ఒక్కరు వావ్ అనాలి అనిపించేంత అందంగా ఉంది. మొదటి  సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడికి ఆఫర్లు రావడం మొదలు అయ్యాయి.ఇప్పటికే రవితేజ సినిమాలో శ్రీలీలకు అవకాశం దక్కింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమెకు మరో ఇద్దరు యంగ్ హీరోల నుండి కూడా ఆఫర్లు అందాయనే వార్తలు వస్తున్నాయి. మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీలకు మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ దక్కిందట. ఇటీవల ఒక మెగా హీరోకు జోడీగా ఈమె నటించే అవకాశం ను దక్కించుకుందని.. చర్చల దశలో ఉన్న ఆ మెగా మూవీ ని వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో శ్రీలీల నటించబోతున్న ఆమె మూవీ ఏంటీ.. ఏ మెగా హీరోతో నటించబోతుంది అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అయితే శ్రీలీలకు మెగా ఆఫర్ వచ్చింది అనేది నిజమే అంటూ మీడియా వర్గాల వారు కూడా అంటున్నారు.

కొత్త హీరోయిన్స్ కు మెగా ఆఫర్ దక్కితే కెరీర్ లో కొంత కాలం పాటు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కనుక శ్రీలీలకు ఈ ఆఫర్ ఖచ్చితంగా కెరీర్ లో టర్న్ అయ్యే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. మెగా ఫ్యామిలీకి చెందిన మరింత మంది హీరోలతో కూడా ఆమె నటించే అవకాశాలను ముందు ముందు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదు. శ్రీలీల ఈ సమయంలో ఆఫర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ రెండు మూడు సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటే ఇతర స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.