`సర్కారు వారి పాట`లో నిధి అగర్వాల్ మాదిరి ఉన్న ఆ బ్యూటీ ఎవరు?

Sat May 14 2022 05:00:02 GMT+0530 (IST)

soumya menon in sarkaru vaari paata movie

దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నుంచి వచ్చిన చిత్రం `సర్కారు వారి పాట`. గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఫామ్ లోకి వచ్చిన యువ దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని రూపొందించగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.భారీ అంచనాల నడుమ నిన్న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మహేష్ లుక్స్ కామెడీ టైమింగ్ కీర్తి సురేష్ తో లవ్ ట్రాక్ యాక్షన్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులేయడంతో అభిమానులు మరియు సినీ ప్రియులు సర్కారు వారి పాటపై పాజిటివ్ రివ్యూలు ఇచ్చేశారు.

కానీ ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం.. ఇది కూడా మహేశ్ గత చిత్రాల మాదిరిగానే సందేశంతో కూడిన కమర్షియల్ సినిమా అంటూ పెదవి విరిచారు. ఏదేమైనప్పటికీ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ భారీగా పెంచిన బజ్ తో నిన్న దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి. అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ తో పాటు మరో బ్యూటీ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె ఎవరో కాదు సౌమ్య మీనన్. అచ్చం నిధి అగర్వాల్ మాదిరి కనిపించే  ఈ భామ.. సినిమాలో కీర్తి సురేష్ కు ఫ్రెండ్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో సౌమ్య మీనన్ ఎవరు..? అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటీ..? అంటూ నెటిజన్లు గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.

వాస్తవానికి సౌమ్య మీనన్ మలయాళంకు చెందిన నటి. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. 2018లో విడుదలైన `కినావల్లి` అనే మలయాళ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ చిల్డ్రన్స్ పార్క్ మార్గంకాళి ఇలా అరడజన్ కు పైగా సినిమాలు చేసింది. ప్రస్తుతం మలయాళ సినిమాలతో పాటు కన్నడలో `హంటర్ ఆన్ డ్యూటీ` అనే మూవీలో నటిస్తోంది.

తెలుగులో `టాక్సీ` అనే సినిమాకు సైన్ చేసింది. అయితే ఇది విడుదల అవ్వకముందే `సర్కారు వారి పాట`లో ఛాన్స్ కొట్టేసి.. మహేష్ బాబు వంటి స్టార్ హీరో మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ మూవీ ద్వారా వచ్చిన క్రేజ్ సౌమ్య మీనన్ కు తెలుగులో మరిన్ని అవకాశాలను తెచ్చి పెడుతుందో.. లేదో.. చూడాలి.