సోనాల్ చౌహాన్ తడాఖా చూపించిందా?

Wed Oct 05 2022 20:00:21 GMT+0530 (India Standard Time)

sonal chauhan The Ghost movie news

సోనాల్ చౌహాన్ గురించి పరిచయం అవసరం లేదు. నటసింహ బాలకృష్ణ ప్రోత్సాహంతో టాలీవుడ్ లో ఐడెంటిటీ దక్కించుకుంది. కానీ నటిగా మాత్రం ఆశించిన విధంగా కెరీర సాగలేదు. ప్రతిభావంతురాలే అయినా ఏదో లోపం అమ్మడికి అడ్డంకిగా మారింది. సో నాల్ తో పాటు వెనుకా ముందు వచ్చిన భామలు హీరోయిన్లుగా బిజీ అయ్యారు గానీ..సోనాల్ మాత్రం బిజీ కాలేకపోయింది.ఆ మధ్య `ఎఫ్-3` తో ఓ సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. అయితే సత్తా చాటుకునే రోల్ మాత్రం ఇప్పటివరకూ పడలేదు. సెకెండ్ లీడ్..గ్గెస్ట్ అప్పీరియన్స్ కే పరిమితమైంది తప్ప! తన ఐడెంటీటిని చాటే లెంగ్తీ రోల్ దక్కలేదు.  సరిగ్గా అదే సమయంలో అమ్మడికి  కింగ్ నాగార్జున్ `ది ఘోస్ట్`  యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ లో  అవకాశం కల్పించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ అయింది.

ఇందులో అమ్మడు ఇంటర్ పోల్ ఆఫీసర్ ప్రియ పాత్రలో నటించింది. మరి ఇంటర్ పోల్ ఆఫీసర్ గా  ఏ మేర మెప్పించిందంట?  అమ్మడు తడాఖా చూపించిందనే టాక్ వినిపిస్తుంది. సాహసోపేతమైన యాక్షన్ పాత్రలో ఆద్యంతం ఆకట్టుకుందంటున్నారు. తెరపై కనిపించినంత సేపు యాక్షన్ సీక్వెన్స్ లో తనదైన మార్క్ వేసిందనే టాక్ స్ర్పెడ్ అవుతుంది.

పాత్ర కోసం ప్రాణం పెట్టి పనిచేసిందని  ప్రశంసలు దక్కుతున్నాయి.  రక్తం..స్వేదం చిందించని ముచ్చటించుకున్నారు. చాలా తక్కువ మంది మహిళా నటీనటులు మాత్రమే ఇలాంటి  యాక్షన్ రోల్స్‌లో మెప్పించగలరని కితాబు అందుకుంటుంది. అలాంటి వారిలో  సోనాల్ కి ప్రధమ స్థానం కట్టబెట్టొచ్చన్నది మరికొంత మంది అభిప్రాయం.

తెరపై తన శ్రమ..ఎఫెర్ట్ అంతా కనిపించిందంటున్నారు. మొత్తానికి ఈ రకమైన ప్రశంసలతో సోనాల్ ప్రస్తుతానికి తడిసి ముద్దవుతుంది. అవి కొత్త అవకాశాలు తెచ్చిపెడితేనే? అవి పరిపూర్ణం అవుతాయి.  లేదంట పడిన శ్రమ...దక్కిన ప్రశంసలు అన్నీ వృద్ధాగానే మిగిలిపోతాయి.  సినిమాలో నాగార్జునకు పర్ పెక్ట్ జోడీగా సూటయింది. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోలైనా చిరంజీవి..వెంకటేష్..రవితేజ లాంటి హీరోలకు సోనాల్ ఆప్షన్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం  లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.