`ఎఫ్-3` లో సోనాల్ సర్ ప్రైజింగ్ రోల్!

Sun Oct 24 2021 22:00:01 GMT+0530 (IST)

sonal chauhan Role In F3 Movie

యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి `ఎఫ్ -2` కి సీక్వెల్ గా ఎఫ్ -3ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. `ఎఫ్ -2` లో నటించిన నటీనటులతోనే ఈ సీక్వెల్ని తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ కు జోడీగా తమన్నా..వరుణ్ తేజ్ కి జోడీగా మెహరీన్  నటిస్తున్నారు. ఇక మూడవ హీరోయిన్ సోనాల్ చౌహాన్ తీసుకున్నారు. ఇందులో సోనాల్ పాత్ర కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుందని యూనిట్ తెలిపింది. సోనాల్ ఎంట్రీతో సినిమాకు మంరింత మసాలా దట్టించినట్లు అయిందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. తాజాగా సినిమాలో తన పాత్ర గురించి సోనాల్ చౌహాన్ రివీల్ చేసింది.`ఎఫ్ -2` సినిమా చూసాను. కానీ ఈ సినిమా సీక్వెల్ లో నటిస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇందులో నా పాత్రకు చాలా స్కోప్ ఉంది. చాలా కాలం తర్వాత మంచి రోల్ చేస్తున్నానని ఎగ్టైట్ మెంట్ కల్గుతోంది.  పాత్రను ఓన్ చేసుకుని దర్శకుడితో కలిసి ప్రయాణిస్తున్నాను.  తెలుగులో నాకొక మంచి చిత్రంగా ఎఫ్ -3 నిలిచిపోతుంది. ఏదైనా పాత్రను బట్టే గుర్తింపు ఉంటుంది. గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా ఇందులో నా పాత్ర ఉంటుంది. అందర్నీ ఆకట్టుకునేలా అనీల్ పాత్రను డిజైన్ చేసారు` అని తెలిపింది. అలాగే కొత్త అవకాశాలు కూడా వస్తున్నట్లు వెల్లడించింది.  ఇప్పటికే సోనాల్ ఒక షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో అమ్మడి కెరీర్ ప్రస్తావిస్తే  `రెయిన్ బో ` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలయ్య సరసన `లెజెండ్` లో సెకెండ్ లీడ్ లో నటించింది.  ఆ సినిమా హిట్  గుర్తింపు నిచ్చింది. ఈ నేపథ్యంలోనే `పండగ చేస్కో`..`షేర్` చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత మళ్లీ బాలయ్యే అకాశాలు కల్పించారు. `డిక్టేటర్`..`రూలర్ `చిత్రాల్లో నటించింది.  కానీ ఆ చిత్రాలు రెండు బాక్సాఫీస్  వద్ద రాణించలేదు. కొంత గ్యాప్ తర్వాత అనీల్ రావిపూడి ఎఫ్ 3 లో నటించే ఛాన్స్ ఇచ్చారు.