Begin typing your search above and press return to search.

ట్యాప్ విప్పి క‌డ‌వ‌లు నింపేస్తూ అంద‌రినీ ఏడిపించే గాయని కం టీవీ జ‌డ్జి!

By:  Tupaki Desk   |   27 Feb 2021 5:30 PM GMT
ట్యాప్ విప్పి క‌డ‌వ‌లు నింపేస్తూ అంద‌రినీ ఏడిపించే గాయని కం టీవీ జ‌డ్జి!
X
ప‌దే ప‌దే ట్యాప్ విప్పి క‌డ‌వ‌ల కొద్దీ క‌న్నీళ్లు నింపేస్తూ అంద‌రినీ ఏడిపించే గాయని కం జ‌డ్జి ఎవ‌రో చెబుతారా? ఈ ప్ర‌శ్న‌కు `ఇండియ‌న్ ఐడ‌ల్` కార్య‌క్ర‌మ అభిమానులు సులువుగా జ‌వాబు చెప్పేయ‌గ‌ల‌రు. గాయ‌నీ గాయకుల్లో గొప్ప ప్ర‌తిభ‌ను వెలికి తీస్తున్న ఈ టీవీ రియాలిటీ కార్య‌క్ర‌మం ప్ర‌ముఖ హిందీ ఎంట‌ర్ టైన్ మెంట్ చానెల్ లో ప్ర‌స్తుతం టెలీకాస్ట్ అవుతోంది.

ఇప్ప‌టికి 11 సీజ‌న్లు పూర్త‌వ్వ‌గా 12వ సీజ‌న్ మెరుపులు మెరిపిస్తోంది. ఈసారి కూడా కంటెస్టెంట్ లు అద‌ర‌గొడుతున్నారు. ఇండియన్ ఐడల్ 12 లో ఈసారి కూడా తెలుగు ట్యాలెంటు త‌మ అద్భుత గానంతో దుమ్ము దులిపేస్తోంది. ఇక వీళ్లంద‌రిలోనూ పవన్ దీప్ అనే ఉత్త‌రాఖండ్ గాయ‌కుడి గానాలాప‌నకు జ‌డ్జీలు సాహో అంటూ స‌లాం కొడుతున్నారు. ఒకానొక ఎపిసోడ్ లో అతడి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చూశాక‌.. జ‌డ్జి కం గాయ‌ని నేహా కక్కర్ వ‌ల‌వ‌లా ఏడ్చేయ‌డం క‌నిపించింది.

ఇటీవ‌ల‌ ఉత్తరాఖండ్ వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన అభాగ్య కార్మికుల కుటుంబాలకు రూ .3 లక్షలు విరాళంగా ప్ర‌క‌టించారు నేహా క‌క్క‌ర్. అయితే అందుకు ప్రేరేపించిన‌ ఇండియన్ ఐడల్ 12 పోటీదారు పవన్ దీప్ రాజన్ అని చెప్పాలి. అత‌డు త‌న రాష్ట్రంలో త‌ప్పిపోయిన వారికి నివాళి అర్పిస్తూ ఒక పాట‌ను పాడారు. ఆ ఘ‌ట్టాన్ని చూశాక‌ క‌న్నీళ్లు పెట్టుకోకుండా ఎవ‌రూ ఉండ‌లేరు. షో న్యాయమూర్తి ప్రముఖ గాయని నేహా కక్కర్ క‌న్నీళ్ల‌ను త‌ప్పించుకోలేక‌పోయారు. ఉత్తరాఖండ్ చంపావత్ జిల్లాకు చెందిన పవన్ ‌దీప్ రాజన్ ఇండియన్ ఐడల్ 12 - ఇండియా కి ఫర్మైష్ ఎపిసోడ్ లో తన ప్రజల కోసం తన తండ్రి (సాంగ్) కూర్పును పాడారు. ప్రోమోలో ఈ విష‌యం వెల్ల‌డైంది. ఈ వారాంతంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రసారం చేయనున్నారు.

“ఈ రోజు నా తండ్రి సురేష్ రాజన్ స్వరపరిచిన పాటను నేను పాడతాను. టైటిల్ మాల్వా మెయిన్ కాను తలాష్ (ఉత్తరాఖండ్ విల‌యంపై పాట)... చమోలి జిల్లాలో విరిగిప‌డిన హిమానీనదం కారణంగా తప్పిపోయిన వారికి ఇది నివాళి. మనందరికీ తెలిసినట్లుగా.. ఆన్ సైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పిపోయిన వ్యక్తుల కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ మళ్ళీ ఆ కార్మికులపై ఆధారపడిన కుటుంబాలకు సహాయం చేయమని సీఎం త్రివేంద్ర సింగ్ రావత్జీని అభ్యర్థించడం నా కర్తవ్యం .. ” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించాడు.

వారాంతపు ఎపిసోడ్ లో.. గాయ‌కుడు పవన్ దీప్ రాజన్ ఉత్తరాఖండి పాట పాడటం హైలైట్ అయ్యింది. ఆ తరువాత.. హుమారి అధూరి కహానీ పాడారు. వ‌ర‌ద ఉధృతికి కార్మికులలో తప్పిపోయిన వారిని త‌ల‌చుకుని నేహా కక్కర్ ఏడుస్తూ నిస్సహాయంగా కనిపించారు ఆ స‌య‌మ‌యంలో. అన్న‌ట్టు ప్రతి ఎపిసోడ్ లో నేహాక‌క్క‌ర్ ఇంచుమించుగా కంట‌త‌డి పెట్టే స‌న్నివేశం ఉండ‌క‌పోదు. తాను ఎంతో ఎమోష‌న‌ల్. ఏ బాధ విన్నా త‌ట్టుకోలేదు. వెంట‌నే వ‌ల‌వ‌లా ఏడ్చేస్తుంది. ఆ క‌న్నీళ్ల‌ను దోసిట ప‌డితే ఈపాటికే కుండ నిండేది! అంటూ అభిమానులు కూడా ఎమోష‌న్ అవుతుంటారు మ‌రి!!