ఆల్ బ్లాక్ లో శ్రుతిహాసన్ స్టన్నింగ్ ఫోజ్

Sat Jun 19 2021 05:00:01 GMT+0530 (IST)

shruti hassan Latest Photo

ఇటీవల కొంతకాలంగా గోథిక్ కల్చర్ ని పరిచయం చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్న శ్రుతిహాసన్ రకరకాల మేకప్ విధానాల్ని వింతలతో కూడుకున్న ఆహార్యాన్ని చూపిస్తూ తన అభిమానుల్ని ఎంటర్ టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ స్టా వేదికగా శ్రుతి వెరైటీ ప్రమోషన్ కి గొప్ప స్పందన వచ్చింది.ప్రియుడు శంతను హజారికా డూడుల్ ఆర్ట్ ని కూడా శ్రుతి గొప్పగా ప్రమోట్ చేస్తోంది. ఇటీవల శంతను రంగుల ప్యాలెట్ హౌస్ లో శ్రుతి ఫోజులు అభిమానుల్లో వైరల్ అయ్యాయి. తాజాగా శ్రుతి ఆల్ బ్లాక్ లుక్ ని షేర్ చేయగా అంతే స్పీడ్ గా యువతరంలో దూసుకెళుతోంది.

బ్లాక్ టాప్.. బ్లాక్ థై స్లిట్ బాటమ్ లో శ్రుతి బోల్డ్ లుక్ సంథింగ్ హాట్ గా కనిపిస్తోంది. పింక్ వాల్ నేపథ్యంలో సెటప్ చేసిన ఈ ఫోటోషూట్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆల్ బ్లాక్ లో శ్రుతి తప్ప ఇంకెవరూ ఇంతందంగా ఫోజులివ్వలేరు సుమీ అంటూ అభిమానులు వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు. క్రాక్- వకీల్ సాబ్ తర్వాత ప్రస్తుతం ఈ భామ తన తమిళ చిత్రం రిలీజ్ కోసం వేచి చూస్తోంది. మరోవైపు ప్రభాస్ సరసన సలార్ లో నటించాల్సి ఉండగా షెడ్యూల్ కోసం ప్రశాంత్ నీల్ ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారని తెలిసింది.