Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ తో చిట్ చాట్ లో టాటూ విషయం చెప్పిన సలార్ బ్యూటీ

By:  Tupaki Desk   |   25 Jun 2022 2:30 AM GMT
ఫ్యాన్స్ తో చిట్ చాట్ లో టాటూ విషయం చెప్పిన సలార్ బ్యూటీ
X
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్ తాజాగా తన ఫాలోవర్స్‌తో ముచ్చటించారు. అందులో భాగంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న తన ఫాలోవర్స్‌తో మాట్లాడుతూ.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అందులో భాగంగా తన పచ్చబొట్టు గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సినిమా స్టార్స్ అంతా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. ఎప్పటికప్పుడు వారు చేస్తున్న సినిమా ల అప్ డేట్స్ పంచుకుంటూ.. వారికి సంబంధించిన ఫొటోలతో ఫ్యాన్స్ ని ఖుష్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటారు. శ్రుతి హాసన్ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటారు. ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో ముచ్చటించిన శ్రుతి.. తన పచ్చబొట్టు గురించి ప్రస్తావించింది.

శ్రుతి హాసన్.. కమల్ హాసన్ కూతురు గా సినిమాల్లోకి అడుగుపెట్టి.. మొదట్లో ఐరన్ లెగ్ అనిపించుకున్నా.. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత గోల్డెన్ బ్యూటీ గా పేరుతెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో అప్పుడప్పుడు ముచ్చటిస్తూ ఉంటుంది.


తాజాగా ఇన్ స్టాలో తన ఫాలోవర్స్ తో ముచ్చటించిన శ్రుతి.. ఓ నెటిజన్ తన టాటూ గురించి అడగ్గా సమాధానమిచ్చింది. తన చేతికి ఉన్న టాటూ ఫొటో పంచుకుంటూ దానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ షేర్ చేసుకుంది.

ఆ టాటూ రోజ్ అని.. అయితే అది చూడటానికి క్యాబేజీలా ఉంటుందని చెప్పింది. అది క్యాబేజిలా ఉండటానికి కారణం దానికి ప్రేమ కావాలి. అందుకే అది క్యాబేజిలా కనిపిస్తుంది అని తెలిపింది. ఇక దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శ్రుతి ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌‌ను మరోసారి సింగరేణిలో చేయనున్నారు. ఈ షెడ్యూల్లో శ్రుతి హాసన్, ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా పిక్చరైజ్ చేయనున్నట్టు సమాచారం.