Begin typing your search above and press return to search.

లేడీ సింహం రాబోతుంది..!

By:  Tupaki Desk   |   5 Dec 2022 11:30 PM GMT
లేడీ సింహం రాబోతుంది..!
X
నందమూరి నట సింహం బాలకృష్ణ 107వ సినిమాగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వీర సింహారెడ్డి వస్తుంది. గోపీచంద్ మార్క్ మాస్ కథతో.. బాలయ్య మార్క్ ఊర మాస్ స్క్రీన్ ప్లేతో ఈ మూవీ రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సీనియర్ హీరోలతో నటించడానికి మామూలుగా అయితే హీరోయిన్స్ నో చెబుతారు కానీ బాలకృష్ణ సినిమాకు ఓకే చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది శృతి హాసన్.

వీర సింహారెడ్డి లో శృతి హాసన్ ఎలా ఉండబోతుంది. ఆమె ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది అన్న ఫ్యాన్స్ ఎదురుచూపులను అర్ధం చేసుకున్న మేకర్స్ వీర సింహారెడ్డి నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.

సినిమాలో శృతి హాసన్ పాత్ర కూడా వెరైటీగా ఉంటుందని అంటున్నారు. శృతి హాసన్ కూడా ఈ పాత్రని ఛాలెనింగ్ గా తీసుకుని చేస్తుందని అంటున్నారు. ఓ పక్క సలార్ లో ప్రభాస్ సరసన నటిస్తున్న శృతి హాసన్ మరోపక్క సీనియర్ స్టార్స్ తో నటిస్తుంది.

వీర సింహారెడ్డి మాత్రమే కాదు చిరు వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా శృతి హాసన్ నటిస్తుంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడం విశేషం. వీర సింహారెడ్డి నుంచి శృతి హాసన్ లుక్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ లేడీ సింహం ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. సినిమాలో శృతి హాసన్ తో పాటుగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తుంది. ఆమెకు కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ దక్కిందని తెలుస్తుంది.

కొన్నాళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శృతి హాసన్ మళ్లీ వరుస టాలీవుడ్ ప్రాజెక్ట్ లతో సత్తా చాటుతుంది. వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాల్లో ఏ ఒక్కటి సూపర్ హిట్ అయినా అమ్మడు మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చినట్టే. వీర సింహా రెడ్డి మూవీని జనవరి 12న రిలీజ్ డేట్ లాక్ చేశారు. అదేరోజు విజయ్ వారసుడు వస్తున్నాడు. మరి వాల్తేరు వీరయ్య రిలీజ్ ముందుకి జరుపుకుంటాడా.. తర్వాత పెట్టుకుంటాడా అని తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.