పెళ్లి వద్దు లీవిన్ రిలేషనే ముద్దంటోంది

Thu Jan 20 2022 16:16:08 GMT+0530 (IST)

shruti haasan About Living Relationship

పెళ్లికి హీరోలు సై అంటుంటే హీరోయిన్ లు మాత్రం నై అంటున్నారు. అందులో ముందు వరుసలో నిలుస్తోంది కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్. తమిళంలో కంటే తెలుగు హిందీ భాషల్లోనే పేరు తెచ్చుకున్న శృతి పెళ్లి వద్దు లీవిన్ రిలేషనే ముద్దంటోంది. 35 ఏళ్లు దాటినా పెళ్లి మాటంటే చిరాకు పడుతోంది. మాస్ మహా రాజా రవితేజ నటించిన `క్రాక్` బ్లాక్ బస్టర్ కావడంతో మళ్లీ స్టార్ హీరోయిన్ గా బౌన్స్ బ్యాక్ అయిన శృతి గత కొంత కాలంగా శాంతను హజారికాలో సహ జీవనం చేస్తోంది.లాక్ డౌన్ సమయంలో ముంబైలో వీరిద్దరు కలిసి వున్న విషయం తెలిసిందే. అతన్ని తాను ఫస్ట్ టైమ్ ఎలా ఎప్పుడు? ఎక్కడ కలిసిందో తను ఎలాంటి ఫుడ్ ని ఇష్టపడతాడో చెప్పిన శృతి.. శంతను హజారికతో కలిసి గత కొంత కాలంగా నెట్టింట సందడి చేస్తోంది. ఫుడ్ తింగున్న వీడియోలతో పాటు ఇద్దరు కలిసి వర్కవుట్ లు చేస్తున్న వీడియోలని కూడా పోస్ట్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

పలు మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లోనూ శంతను గురించి గొప్పగా చెబుతోంది. మరి ఇంత గొప్పగా ఇంత డీప్ గా అతని గురించి చెబుతున్నారు కదా? మరి పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారని అడిగితే మాత్రం పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని అది తనకు ఇష్టం లేదని చెప్పేస్తోంది. అంతే కాకుండా తనకు లీవిన్ రిలేష నే బాగుందని చెప్పుకొచ్చింది. అంటే శృతి హాసన్ పెళ్లికి నో లీవిన్ రిలేషన్ కు ఓకే అన్నట్టుగా వుందని అంతా వాపోతున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న కమల్ హాసన్ సారి ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత కమల్ కొంత కాలం నటి గౌతమితో కలిసి సహ జీవనం చేశారు. ఇదే శృతి హాసన్ మైండ్ లో బలంగా నాటుకు పోయిందని ఆ కారణంగానే తనకు పెళ్లిపై పెద్దగా నమ్మకం లేదని ఆ కారణంగానే ఆమె పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ఇలా రివర్స్ గా మాట్లాడుతోందని తమిళ వర్గాలు అంటున్నాయి.

శృతిహాసన్ గతంలో మేఖేల్ కోర్సల్ తో డేటింగ్ చేసి ఆ తరువాత విడిపోయింది. కొంత కాలం ఒంటరిగా వుంటూ సినిమాలకు దూరంగా వున్న శృతి ఇటీవలే శంతను హజారికతో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి `సలార్`లో నటిస్తున్న విసయం తెలిసిందే. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ పై శృతి భారీ అంచనాలు పెట్టుకుంది.