డీప్ లిప్ లాక్ తో ఉక్కిరిబిక్కిరి చేసిన శ్రీయ

Thu Jun 17 2021 10:00:01 GMT+0530 (IST)

shreya saran choked with a deep lip lock

డీప్ గా లిప్ లాక్ వేయడంలో కొంతైనా అనుభవం విజ్ఞానం ఉండాలి. ఇందులో ఎక్స్ పర్ట్ లానే కనిపిస్తోంది అందాల శ్రీయ శరణ్. ఈ భామ రెండు దశాబ్ధాల సుధీర్ఘ కెరీర్ ని సాగించింది టాలీవుడ్ లో. ఇక తన లైఫ్ లో మరో అంకం పెళ్లి.. స్పానిష్ క్రీడాకారుడు వ్యాపారవేత్త అయిన ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడిన ఈ బ్యూటీ ఆ తర్వాత భర్తతో మూడేళ్ల పాటు విదేశాలలోనే ఉండిపోయింది. దేశ విదేశాల్లో విహరించి లైఫ్ ని ఆస్వాధించింది.ఇప్పుడు ఇండియాలోనే స్థిరపడుతోంది. ముంబైలో భర్తను కొంగున కట్టుకుని దిగిపోయిందని ఇటీవల కథనాలొచ్చాయి. అదంతా సరే కానీ శ్రీయ తన రొమాంటిక్ లైఫ్ ని ఏనాడూ దాచుకోలేదు. ఇంతకుముందు ప్రపంచ వింతలన్నిటి వద్దా విహరించి అక్కడ రొమాంటిక్ ఫోజులతో అదరగొట్టింది. వాటన్నిటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి.

తాజాగా శ్రీయ సోషల్ మీడియాలో షేర్ చేసిన లిప్ లాక్ ఫోటోలు దుమారం రేపుతున్నాయి. ఆండ్రూని డీప్ కిస్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మూడు నాలుగు ఫోటోలు అదే పనిగా యువతరంలో వైరల్ అవుతున్నాయి. ఘాటైన ముద్దు అంటే ఇలా ఉండాలి! అన్నంతగా లీనమై డీప్ లిప్ లాక్ వేసింది శ్రీయ. అంత ఘాటైన పెదవి ముద్దుతో బంధిస్తే ఎవరైనా లాకైపోకుండా ఉంటారా? అందుకే అతగాడిని అంతగా కొంగున కట్టేసుకుంది అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. తదుపరి బాలీవుడ్ టాలీవుడ్ లో నటించే ఆలోచనలో ఉన్న శ్రీయ ఇప్పటికే దర్శకనిర్మాతలు హీరోలకు ఫీలర్స్ వదిలిందని తెలిసింది.