Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : నాలుగు పదుల వయసులోనూ అదే అందం

By:  Tupaki Desk   |   29 Jan 2022 12:30 AM GMT
పిక్ టాక్ : నాలుగు పదుల వయసులోనూ అదే అందం
X
శ్రియ హీరోయిన్‌ గా 2001 సంవత్సరంలో ఇష్టం సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఆసినిమా నుండి ఇప్పటి వరకు ఆమె కెరీర్‌ కొనసాగిస్తూనే ఉంది. ఆమె హీరోయిన్ గా తెలుగు లోనే కాకుండా హిందీ లో కన్నడం లో మలయాళంలో ఇంగ్లీష్‌ మరియు తమిళంలో కూడా సినిమాలు చేసింది. తెలుగు లో ఈమె దాదాపు అందరు సీనియర్‌ స్టార్‌ హీరోలతో సినిమా లు చేసింది. తమిళ సూపర్‌ స్టార్‌.. టాలీవుడ్‌ సూపర్ స్టార్‌.. కన్నడ సూపర్ స్టార్‌ మరియు మలయాళ సూపర్ స్టార్ లతో సినిమాలు చేసిన ఒకే ఒక్క హీరోయిన్ గా ఈ అమ్మడు రికార్డు దక్కించుకుంది. శ్రియ శరణ్‌ నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను దక్కించుకుంది. హీరోయిన్ గా దాదాపుగా పుష్కర కాలం పాటు స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఈ అమ్మడు గత కొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సినిమా లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

హీరోయిన్ గా శ్రియ శరన్‌ ఇంకా ఆఫర్లు దక్కించుకుంటుంది అంటే ఆమె అందం కారణం అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌ గా ఇరవై ఏళ్లు అయినా కూడా ఇంకా ఈ అమ్మడి అందం పెరుగుతుంది కాని తగ్గడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈమె షేర్‌ చేసిన ఈ ఫొటోలు మరియు వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల తల్లి అయిన ఈ అమ్మడు అందాల ప్రదర్శణ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. రెగ్యులర్ గా తన హాట్ ఫొటో షూట్‌ ను షేర్‌ చేస్తూనే ఉంది. తాజాగా ఈ ఫొటోలతో నెట్టింట సందడి చేస్తున్న ఈ అమ్మడు ఆకట్టుకునే అందంతో పాటు ప్రతి ఒక్కరిని కదిలించే చూపులతో కవ్విస్తూనే ఉంది.

ఇటీవలే గమనం సినిమాలో నటించి నటిగా మరోసారి తనను తాను నిరూపించుకున్న ఈ అమ్మడు మరో వైపు హీరోయిన్‌ గా కూడా వరుస సినిమాలు చేస్తోంది. నెట్టింట ఈ అమ్మడు ఫొటోలు షేర్‌ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. ఈమె నటించిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. హిందీలో కూడా ఈమె ప్రస్తుతం ఒక సినిమా ను చేస్తోంది. తెలుగు లో ఈమె కు రెగ్యులర్‌ గా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కాని కాస్త ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. నాలుగు పదుల వయసు కు దగ్గర పడ్డ ఈ అమ్మడు అందం ఏమాత్రం తగ్గలేదు. శ్రియ శరన్‌ ఈమద్య కాలంలో తన బిడ్డతో ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంది. అయినా కూడా ఈమె అందాల ప్రదర్శణ ఫొటో షూట్‌ కూడా రెగ్యులర్ గా వైరల్‌ అవుతున్నాయి. సాదారనంగా అయితే అమ్మ అయిన వారి హాట్ ఫొటో షూట్స్ కు పెద్దగా ఆధరణ ఉండదు. కాని శ్రియ శరన్‌ ను ఇంకా కూడా అందంగా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు అంటే కారణం ఆమె అందం కారణం అనడంలో సందేహం లేదు.