హిట్టు లేక అల్లాడుతున్న యంగ్ హీరో

Tue Feb 25 2020 20:00:01 GMT+0530 (IST)

sharwanand flop movies effect on srikaram movie

ఏదైనా సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ రోల్ ఉందంటే యంగ్ హీరోలో ఓ ఇద్దరు ముగ్గురు పేర్లు ముందుగా పరిశీలనలోకి వస్తాయి. అందులో శర్వానంద్ పేరు కూడా ఉంటుందనడం లో సందేహం లేదు. అవును నాని తర్వాత నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే హీరో శర్వానంద్. అందుకే కొన్ని సినిమాలు ముందుగ ఎవరెవరికో వెళ్లి ఫైనల్ గా అతని చేతిలో పడ్డాయి.అయితే 'శతమానం భవతి' తర్వాత ఎందుకో ఈ హీరోకి అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. 'రాధా''పడి పడి లేచె మనసు''రణరంగం' ఇలా వరుసగా మూడు ఫ్లాపులొచ్చాయి. దీంతో శర్వా మార్కెట్ బాగా పడిపోయింది. ఓ స్ట్రాంగ్ హిట్ కొడితేనే కానీ పనయ్యేలా లేదు. ఇక తాజాగా వచ్చిన 'జాను' మీద కొంత హాప్ పెట్టుకున్నడీ హీరో. రిలీజ్ రోజు మంచి టాక్ వచ్చినా పాజిటీవ్ రివ్యూలు పడినా సినిమా మ్యాట్నీ నుండే డ్రాప్ అయింది. ఇక మళ్ళీ కలెక్షన్స్ తో ఊపందుకోలేదు.

ప్రస్తుతం శర్వా చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ముందుగా 'శ్రీకారం' అనే సినిమా వస్తుంది. ఓ ఇండిపెండెంట్ సినిమాలో కథను తీసుకొనే అదే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు శర్వా. ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు. సమ్మర్ స్పెషల్ గా రానున్న ఈ సినిమా అయినా శర్వా విజయాలకు శ్రీకారం చుడుతుందేమో చూడాలి.