మాస్ రాజాతో వివాదం ముగిసినట్టేనా?

Thu Jul 07 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

sharath mandava and ravi teja movie news

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ `రామారావు ఆన్ డ్యూటీ`. ఈ మూవీ ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఎట్టకేలకు జూలై 29న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.ఈ నెల 17నే విడుదల కావాల్సిన ఈ మూవీ హీరో రవితేజ కారణంగానే వాయిదా పడిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. దానికి బలాన్ని చేకూరుస్తూ చిత్ర బృందం ప్రమోషన్స్ ని కూడా ఆపేసింది.

రీసెంట్ గా మళ్లీ ప్రమోషన్స్ ని మొదలు పెట్టింది. రవితేజ అన్వేషీ జైన్ లపై `నా పేరు సీసా..`  అంటూ  చిత్రీకరించిన మాస్ మసాలా సాంగ్ ని విడుదల చేశారు. దీనితో పాటు వరుసగా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసి మొత్తానికి ఈ మూవీని జూలై 29న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. రవితేజ తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కు సంబంధించిన బ్యాలెన్స్ ఇస్తేగానీ సినిమా షూటింగ్ రానని ఖరాకండీగా చెప్పడం వల్లే ఈ మూవీ రిలీజ్ డేట్ మారిందని వార్తలు మొదలయ్యాయి.

అంతే కాకుండా స్క్రిప్ట్ లో మార్పులు చెప్పడం రీషూట్ లు కోరడం వల్ల కూడా ఈ మూవీ రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చిందని వినిపించిన వార్తలపై తాజాగా దర్శకుడు శరత్ మండవ ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తమ సినిమాపై మీడియాలో వచ్చిన వార్తల్లో అసలు నిజం లేదని స్పష్టం చేశారు. చాలా మంది ఈ వార్తలని నాకు ఫార్వర్డ్ చేశారు. అయితే దీనిపై నేరుగా నన్నే అడిగి వుంటే వివరణ ఇచ్చేవాడినని చెప్పుకొచ్చారు.

షెడ్యూల్ కారణంగా బిజీగా వుండటం వల్ల వివరణ ఇవ్వలేకపోయానని షెడ్యూల్ మారడం వల్లే షూటింగ్ ఆలస్యమైందన్నారు. ఓ పాట చిత్రీకరణని ముందు ఫారిన్ లో అనుకున్నామని అయితే కోవిడ్ కారణంగా దాన్ని  హిమాచల్ ప్రదేశ్ లో చేయాలనుకున్నామన్నారు. తరువాత మళ్లీ ఫారిన్ లోనూ షూట్ చేయాలని ప్లాన్ చేయడంతో కొంత ఆలస్యం అయిందని స్పష్టం చేశారు.

 ఇక రిలీజ్ డేట్ మారడానికి రెండు పాటల చిత్రీకరణ ఆలస్యం కావడానికి రవితేజ కారణం కాదని టాకీ పార్ట్ బ్యాలెన్స్ గా వుండటమేనని దర్శకుడు శరత్ మండవ క్లారిటీ ఇచ్చారు.